Read more!

English | Telugu

వెన్నెల కిషోర్ ‘అలా మొదలైంది’లో నిఖిల్-పల్లవి ప్రేమ కథ!

ఈటీవీలో ప్రసారమవుతున్న కొత్త ప్రోగ్రాం 'అలా మొదలైంది'. వెన్నెల కిషోర్ మొదటిసారి యాంకరింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి గెస్ట్ లుగా నిఖిల్, పల్లవి దంపతులు వచ్చారు.  కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్.. ఈ షోకి రావడంతో కొంత ఆసక్తి కలిగిందనే చెప్పాలి.

నిఖిల్ ని వారి లవ్ స్టోరీ షేర్ చేయమని వెన్నెల కిషోర్ అడగగానే.. మీకు తెలిసిందే కదా అని నిఖిల్ అనగా.. అసలు బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందని చెప్పమన్నాడు కిషోర్. నిఖిల్ తన లవ్ ఎలా మొదలైందో ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్ట్ చేసాడు. పల్లవి, నిఖిల్ ఇద్దరు ఒక పార్టీలో కలిసారని, వాళ్ళ ఫ్రెండ్ బ్రేకప్ కి పల్లవి, నిఖిల్ కలిసి హెల్ప్ చేసారని చెప్తుండగా.‌. ఇదేదో 'ఖుషి' మూవీ స్టోరీలా ఉంది అని వెన్నెల కిషోర్ అనగానే.. ఇద్దరు నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత అలా మెల్లిమెల్లిగా తన మీద క్రష్ ఏర్పడిందని నిఖిల్ అనగా.. 'పరిచయం అయిన గంటకే నాకు ప్రపోజ్ చేసాడు' అని పల్లవి చెప్పగా.. ఏంటి భయ్యా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని వెన్నెల కిషోర్ అన్నాడు. ఆ తర్వాత తన ఇంట్లో వాళ్ళని ఒప్పించడం పెద్ద సమస్యని పల్లవి చెప్పుకొచ్చింది.

మరి లవ్ అంటే మీ ఇంట్లో ఏం అనలేదా భయ్యా అని నిఖిల్ ని వెన్నెల కిషోర్ అడుగగా.. "ఫస్ట్ ఒప్పుకుంది మా అమ్మే.. తనకి నేను పెళ్ళి చేసుకోవడమే కావాలి. అందుకే ఈజీ అయిపోయింది" అని నిఖిల్ అనగా.. నిజానికి మొదట నిఖిల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాకే మా ఇంట్లోవాళ్ళతో లవ్ చేస్తున్నట్టుగా చెప్పానని పల్లవి అంది. నా లైఫ్ లో ఒక అబ్బాయి ఉన్నాడని మా అమ్మనాన్నలతో చెప్పడంతోనే.. అబ్బాయి డాక్టరే కదా? అని అడిగారు.. దాంతో ఏం చెప్పాలో తెలియక బిజినెస్ మ్యాన్ అని చెప్పానని పల్లవి అంది. ఆ తర్వాత ఒకరోజు తనకి చెప్పకుండా గోవాకి తీసుకెళ్ళాను.. అసలు తన ఒంటి మీద డ్రెస్ తప్ప బట్టలు, లగేజీ ఏమీ తీసుకురాలేదు.. గోవాలో దిగాక తీసుకున్నాం అని నిఖిల్ అనగా... అక్కడ నాకు ఒక సర్ ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసాడు కానీ ఆ రెండు రోజులు గోవాలో ఫుల్ వర్షం దాంతో అతను వేసిన సెటప్ మొత్తం వర్షంలో పోయింది. ఆ తర్వాత రోజు ఎర్రగులాబీలతో తన దగ్గరికి వెళ్ళి ఐ వాన్నా అని నేను ప్రపోజ్ చేయడం పూర్తి చేయకుండానే.‌.. ఆ ఓకే ఓకే అని పల్లవి పూలు తీసుకుందని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇది విని‌ పల్లవితో పాటు వెన్నెల కిషోర్ నవ్వుకున్నాడు. 'అలా మొదలైంది' ద్వారా నిఖిల్, పల్లవి లవ్ అలా మొదలైందని తెలిసింది.