English | Telugu
మురారిని ఇంకా క్షమించని కృష్ణ.. సంతోషంలో ముకుంద!
Updated : Apr 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121లో.. మురారి తనని క్షమించమని కృష్ణని అడుగుతాడు. అయినా కృష్ణ క్షమించకుండా నందు రూమ్ లోకి వెళ్తుండగా.. "మరి నేనేం చెయ్యాలి కృష్ణ.. చచ్చిపోనా" అని మురారి అనేసరికి కృష్ణకి గుండె ఆగినంత పని అవుతుంది. "ఏసీపి సర్.. ఏంటా మాటలు" అని కంటతడి పెట్టుకొని వెనక్కి వచ్చి మురారితో మాట్లాడుతుంది. అవును కృష్ణ నువ్వు నన్ను క్షమించకపోతే ఏదోలా ఉందని మురారి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గురించే ఆలోచిస్తూ మురారి హాల్లోనే పడుకుంటాడు. కృష్ణ కూడా మురారితో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది.
ఆ తర్వాత ఉదయం ముకుంద లేచి హాల్లోకి వచ్చేసరికి మురారి హాల్లో పడుకోవడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ, మురారిల మధ్యలో మాటలు కూడా లేవా.. ఇన్ని రోజులు మురారిని అపార్థం చేసుకున్నా అని ముకుంద అనుకుంటుంది. మురారి మాత్రం నిద్ర లేచి మళ్ళీ కృష్ణని క్షమించమని అడగాలి అని కృష్ణ దగ్గరికి వెళ్తాడు. అలా తను వెళ్లేసరికి కృష్ణ పడుకునే ఉంటుంది. మురారి మాత్రం కృష్ణను చూస్తూనే ఉంటాడు. ఇక కృష్ణ లేచి మురారితో పాజిటివ్ గా మాట్లాడుతుంది. కృష్ణ నన్ను క్షమించవా అని మురారి అడుగుతాడు. నిన్ను క్షమించాలంటే నాకు ఒక హెల్ప్ చెయ్యాలని కృష్ణ చెప్తుంది. ఏం చేయాలి చెప్పు కృష్ణ చేస్తాను అని మురారి అంటాడు. ఇద్దరు మేజర్ లకు పెళ్లి చెయ్యాలని నందు, గౌతమ్ లను దృష్టిలో పెట్టుకొని అంటుంది. ఎవరికి పెళ్లి చెయ్యాలి కృష్ణ అని మురారి అడగగానే.. టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు మీరు మాటివ్వండని కృష్ణ అనగానే సరే చేస్తానని మురారి మాటిస్తాడు.
మరోవైపు భవాని, రేవతిని పిలుస్తుంది. నేను నందుని అమెరికాలో ఉన్న మా అక్క దగ్గరికి పంపిస్తున్నాను.. నీ కోడలిని ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పమని భవాని అంటుంది. నందు ఆరోగ్యం బాగుండాలనే కృష్ణ చూస్తుంది కదా అక్క.. కృష్ణ తో ట్రీట్మెంట్ ఇప్పిస్తే నందు బాగుంటుంది కదా అక్క అని రేవతి అంటుంది. ఇంతలోనే ఈశ్వర్ వచ్చి రేవతిని కోప్పడి చెప్పింది చేయమని అంటాడు. చివరికి మంచి గెలుస్తుందని రేవతి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.