Read more!

English | Telugu

బిగ్ బాస్ బజ్ కి యాంకర్ అవుతున్నావా?

ఆదిరెడ్డి పేరు వింటే చాలు బిగ్ బాస్ సీజన్ 6 లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో వెళ్లిన యూట్యూబర్ గుర్తొస్తారు. ఇక ఈ షోలో ఆదిరెడ్డి తన పెర్ఫార్మెన్స్ తో అటు కంటెస్టెంట్స్ కి, ఇటు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆదిరెడ్డితో పాటు అతని వైఫ్, వాళ్ళ సిస్టర్ , పిల్లలు కూడా స్మాల్ స్క్రీన్ కి బాగా పరిచయమే...హౌస్ లోకి వెళ్ళకముందు  బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉండేవాడు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి వచ్చాక ఆదిరెడ్డి లైఫ్ టర్న్ అయ్యింది. మంచి పేరొచ్చింది. ఇక షోస్ లో అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ లో ఉండగా రేవంత్ తో, గలాటా గీతూతో మంచి ర్యాపొ మెయింటైన్ చేసాడు. ఆ ఫ్రెండ్ షిప్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా కంటిన్యూ అవుతోంది.

నిజానికి ఆడియన్స్ అంతా ఆది రెడ్డికి ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే జెన్యూన్ ఉంటూ రియాలిటీ మాట్లాడ్డం ఒక అంశం ఐతే  అతని డాన్స్ మరో కారణం ..అతను  డ్యాన్స్ చేస్తుంటే నాగార్జున కూడా తెగ నవ్వుకునేవారు. ఆదిరెడ్డి సొంతూరు నెల్లూరులోని వరికుంటపాడు. ఆయనది వ్యవసాయ కుటుంబం. తల్లితండ్రులు, అన్నయ్య, అక్కచెల్లెలితో కలిసి ఎంతో కష్టపడి చదువుకున్నాడు. బిగ్ బాస్ సీజన్-2ను రివ్యూ చేస్తూ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారేసరికి సొంత యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత  బిగ్ బాస్షో లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అలాంటి ఆదిరెడ్డి రీసెంట్ గా పుట్టిన రోజు జరుపుకున్నాడు. "లైఫ్ లో ఫస్ట్ టైం బర్త్ డే కి కేక్ కట్ చేసాను.. నా పుట్టినరోజు సందర్భంగా  శుభాకాంక్షలు తెలిపినందుకు.. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు.. త్వరలో నేను బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ తో వీడియోలు చేయడం ప్రారంభిస్తాను.. త్వరలో  నా గురించి కొన్ని శుభవార్తలను మీతో  కూడా షేర్ చేసుకోబోతున్నాను" అంటూ పోస్ట్ చేశారు. ఆదిరెడ్డి  శుభవార్త అనేసరికి "కొంపతీసి బిగ్ బాస్ బజ్ కి యాంకర్ అవుతున్నావా  అన్నా..ఈసారి బజ్ యాంకర్ మీరేనా అన్నా"  అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.