English | Telugu

పార్టీలో అసభ్యంగా తాకాడు.. అసలు విషయం చెప్పిన నవ్య!

టీవీ నటి నవ్యస్వామికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటించే ఈ బ్యూటీ తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంది. ఇక నటుడు రవికృష్ణతో ఆమె ప్రేమలో ఉందనే విషయం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇలా ఏదొక విషయంలో ఆమె ట్రెండ్ అవుతూ ఉంటుంది. రీసెంట్ గా నవ్యస్వామి అలీతో సరదాగా షోకి గెస్ట్ గా వచ్చింది. గత వారం రిలీజ్ చేసిన ప్రోమోలో కొన్ని ఆసక్తికర సంఘటనలు చెప్పింది.

ఈవెంట్ మేనేజర్ ను కొట్టానని..ఇప్పుడు బ్రతికి ఉన్నాడో, చచ్చాడో కూడా తెలియదంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ విషయంపై వివరణ ఇచ్చింది. అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. స్నేహితులందరితో కలిసి పార్టీకు వెళ్లానని.. అందరం కలిసి డాన్స్ లు చేస్తూ పార్టీ చేసుకుంటున్నామని చెప్పింది. అలాంటి సమయంలో ఈవెంట్ మేనేజర్ వచ్చి తనను వెనుక నుండి అసభ్యంగా తాకాడని.. దాంతో వెంటనే వెనక్కి తిరిగి వాడిని తోసేసి చితక్కొట్టేశానని తెలిపింది.

వాడిని కొట్టిన కొట్టుడుకి తన చేతి వేళ్లు వాచిపోయాయని.. ఇక ఆ ఘటనతో తనకు ఎంతో భయం వేసిందని.. ఇంటికి వెళ్లి ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఎవరో వచ్చి మనల్ని అసభ్యంగా తాకితే ఎలా ఉంటుందని నవ్యస్వామి అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇక చాలా కాలంగా సినిమాల్లో కనిపించాలని ఉందని.. కానీ ఇప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని.. కానీ దానికి ఇంకా సమయం ఉందని తెలిపింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.