English | Telugu

'మీమ్ వేస్కో.. ఐఫోన్ తీస్కో'.. నాగబాబు స్కెచ్‌!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో అతడి ఫోకస్ మొత్తం యూట్యూబ్ పైనే ఉంది. రీసెంట్ గా నాగబాబు 'అదిరింది' షోలో స్కిట్ లు చేసిన కొందరు కమెడియన్స్ తో 'బస్తీ బాయ్స్' అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. 'జాతిరత్నాలు' టైప్ లో ఈ సిరీస్ ను ప్లాన్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ వెబ్ సిరీస్ లో మొదటి ఎపిసోడ్ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ లోనే ఉంది. తన యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ 500k దాటిపోవడంతో ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు నాగబాబు.

అయితే ఇప్పుడు 'బస్తీ బాయ్స్'ను మరింత ప్రమోట్ చేయడానికి నాగబాబు రెడీ అయ్యారు. ఈ మేరకు మీమర్స్ సాయం తీసుకుంటున్నారు. నాగబాబుకి మీమ్స్ అన్నా.. మీమర్స్ అన్నా ఎంతో ఇష్టం. ఇది వరకే మీమర్స్ తో నాగబాబు స్పెషల్ గా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది మీమ్ క్రియేటర్స్ నాగబాబుతో మాట్లాడారు. ఇప్పుడు నాగబాబు మీమర్స్ సాయంతో తన 'బస్తీ బాయ్స్'ను మరింత ఫేమస్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాంటెస్ట్ ను రన్ చేస్తున్నారు.

అందులో గెలిచిన వారికి ఐఫోన్ బహుమతిగా ఇస్తానని చెప్పారు. ''మీమ్స్ అలెర్ట్.. మీమ్ వేస్కో .. ఐఫోన్ తీస్కో'' అనే కాంటెస్ట్ ను పెట్టారు. బస్తీ బాయ్స్ ఎపిసోడ్స్ అన్నీ చూసి మీమ్స్ వేస్తే.. హయ్యస్ట్ రీచ్ వచ్చిన మీమ్‌ కి ఐఫోన్ ఇస్తామని.. ఈ కాంటెస్ట్ బస్తీ బాయ్స్ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉంటుందని.. మీమ్ డిస్క్రిప్షన్‌లో #basthiboysmemes అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలని నాగబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఐఫోన్ తో మీమర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నాగబాబు. మరి ఆయన ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.