English | Telugu

తమ్ముడితో మేకప్ వేయించుకున్న శ్రీముఖి!

బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి.. బిగ్ బాస్ షోతో తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి బుల్లితెరపై ఎలాంటి షోలు లేవు. ఒకప్పుడు వరుస షోలతో బిజీగా ఉండేది శ్రీముఖి. 'పటాస్' షోతో బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకుంది.

అనంతరం బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లింది. ఫైనల్స్ వరకు నిలిచి రన్నరప్ గా సరిపెట్టుకుంది. అయితే గతకొంతకాలంగా ఆమెకి ఏ షో దొరకడం లేదు. స్టార్ట్ మ్యూజిక్ షో సుమ చేతికి వెళ్లింది. 'బొమ్మ అదిరింది' షో ఏమైందో కూడా తెలియదు. ప్రస్తుతం సినిమా ఈవెంట్స్ ఏమీ జరగడం లేదు. దీంతో శ్రీముఖి ఖాళీగానే ఉంటోంది. సోషల్ మీడియాను వాడుకుంటూ నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటోంది.

శ్రీముఖి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ లో పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటుంది. మొన్నామధ్య చేసి 'ఉమేనియా' అనే షో బాగా క్లిక్ అయింది. తాజాగా శ్రీముఖి ఓ వీడియో కోసం తన తమ్ముడిని వాడేసింది. సుశృత్ తనకు మేకప్ వేశాడని చెబుతూ ఆ వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది శ్రీముఖి. అలా సుశృత్ లో ఉన్న టాలెంట్ ను అందరికీ పరిచయం చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.