Read more!

English | Telugu

భార్యను ప్రేమించడానికి లీవ్ తీసుకున్న మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -120 లో.. కృష్ణ ఆలోచనలో పడి మురారి పరధ్యానంగా ఉంటాడు. అప్పుడే స్టేషన్ కి డిజీపి వస్తాడు. ఏంటి మురారి నువ్వు ఇలా చేస్తున్నావ్ భార్య పెట్టే టెన్షన్ కి ఇలా అయ్యావా అని అడుగుతాడు డీజీపీ. లేదు సర్ అని మురారి అంటాడు. ఇంతలోనే డీజీపి భార్య ఫోన్ చేసి.. ఇంటికి తొందరగా రండని తిడుతుంది. అప్పుడు డీజీపీ సరే అని ఫోన్ కట్ చేస్తాడు. నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావ్ మురారి, అదేంటో చెప్పమని అడుగుతాడు. నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్తాడు మురారి. ఏంటి మొన్ననే పెళ్ళి అయింది.. ఇంతలోనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అని డిజీపి అడుగగా.. లేదు సర్.. నా భార్యనే ప్రేమిస్తున్నానని చెప్తాడు. సరే సరే నువ్వు రెండు రోజులు లీవ్ తీసుకొని.. నీ లవ్ ని క్లియర్ చేసుకోమని డీజీపీ చెప్పి వెళ్ళిపోతాడు. 

మరోవైపు నందుని ఎలాగైనా గౌతమ్ కి దగ్గర కానివ్వద్దని భవాని ఆలోచిస్తుంది. ఫారెన్ లో ఉంటున్న తన అక్క దగ్గరికి పంపించాలని దానికి కావలిసిన ఏర్పాట్లు చెయ్యమని ఈశ్వర్ తో చెప్తుంది భవాని. కృష్ణ కాలేజీకి వెళ్తుంది. అక్కడ గౌతమ్ ని కలిసి మాట్లాడుతుంది. సర్ అని కృష్ణ పిలవడంతో.. నన్ను అన్నయ్య అని పిలవమని గౌతమ్ చెప్తాడు. ఇక అక్కడే ఉన్న గౌతమ్ ఫ్రెండ్ బాలు.. ఏంటి రా విలన్ లా ఉండే నువ్వు హీరో అయ్యావ్ అని అడుగుతాడు. అంతా కృష్ణ వల్లే.. తనే నన్ను ఇలా మార్చింది. నందుకి నాకు పెళ్లి చేస్తానని చెప్పిందని గౌతమ్ అంటాడు. 

మరోవైపు మురారి ఇంటికెళ్ళడంతోనే.. కృష్ణ నిన్ను క్షమించిందా అని ముకుంద అడుగుతుంది. ముకుంద అడిగే అన్ని ప్రశ్నలకు చిరాకుగా సమాధానం చెప్పి తన గదిలోకి వెళ్తాడు మురారి.. ఆ తర్వాత కృష్ణ ఇంటికి రాగానే నందు దగ్గరికి వెళ్తుంది. నందు చాలాసేపటి నుండి కృష్ణ అంటూ అడుగుతుంది. కృష్ణ వచ్చాక.. నేను కూడా నీతో పాటు హాస్పిటల్ కి వస్తాను. అక్కడ సిద్దు ఉంటాడని నందు అంటుంది. అక్కడ సిద్దు ఎందుకు ఉంటాడని సర్ది చెప్తుంది కృష్ణ. ఇక నందుని డైవర్ట్ చేయడానికి నీకు చీర కడతానని అంటుంది కృష్ణ. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇక నందుని తీసుకొని గదిలోకి వెళ్తుంది కృష్ణ. 

ఆ తర్వాత కృష్ణతో మురారి మాట్లాడుతుంటాడు. నువ్వు ఇలా ఉంటే.. నేను ఏ పని చెయ్యలేకపోతున్నాను. నీతో మాట్లాడాలని రెండు రోజులు లీవ్ పెట్టాను. నన్ను క్షమించావా అని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.