Read more!

English | Telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ నుండి తప్పుకున్న నటి ఎవరో తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి సీరియల్స్ కి అత్యధిక టీఆర్పీతో పాటు అత్యధిక ఫ్యాన్ బేస్ కలదు. ఇందులో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రసారమయ్యే కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది.

కొన్ని ఎపిసోడ్ ల ముందు మురారి, కృష్ణ ఇద్దరు కారులో వెళ్తుండగా ముకుంద వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ చేస్తాడు. అందులో మురారి ముఖం పూర్తిగా పాడవ్వడంతో ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. దాంతో మురారి స్థానంలో మధుసూదన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక అప్పటి నుండి  అ పాత్రకి ప్రేక్షకులంతా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఫుల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ముకుంద అలియాస్ యశ్మీ గౌడ ఇప్పుడు తాజా ఎపిసోడ్ లలో తన రూపం మార్చుకుంటున్నట్టుగా వాళ్ళ నాన్న శ్రీనివాస్ తో చెప్తుంది. బయట ప్రపంచానికి ముకుంద చనిపోయినట్టుగా నమ్మించిన ముకుంద‌‌ తన రూపం మార్చుకొని వస్తానని అంది‌. అంటే ఇకనుండి యశ్మీ గౌడ పాత్రలో సరికొత్త నటీమణి వస్తుందన్నమాట‌. ఇదే విషయమై నెట్టింట ఈ సీరియల్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. యశ్మీ గౌడ గతంలో స్వాతి చినుకులు, నాగ భైరవి సీరియల్స్ లో నటించారు.

ఇప్పుడు ముకుంద పాత్రలో చేస్తున్న యశ్మీ గౌడ తప్పుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే విషయమై నెట్టింట గట్టిగా చర్చ జరుగుతోంది. అసలు విషయమేంటంటే యశ్మీ గౌడ స్థానంలో రష్మీ ప్రభాకర్ నటించబోతుందట. రష్మీ ప్రభాకర్ గతంలో పౌర్ణమి, కావ్యాంజలి తదితర సీరియల్స్ లో నటించింది. ముకుంద పాత్ర నుండి యశ్మీ గౌడ తప్పుకోవడం ఆమె స్థానంలో రష్మీ ప్రభాకర్ వస్తుందంటే మీకెలా అనిపిస్తుంది‌. ఇంతకీ యశ్మీ గౌడ ఎందుకు తప్పుకుంది.. ఆమె స్థానంలో ఎంట్రీ ఇస్తున్న రష్మీ ప్రభాకర్ ముకుంద పాత్రకి సెట్ అవుతుందా మీకనిపిస్తుందో కామెంట్ చేయండి.