English | Telugu

'కళ్యాణ వైభోగం' కహానీ: దివ్య మరణం తథ్యమా?

దివ్య మరణం తథ్యమా? శాపం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందా? చెల్లి ప్రాణం కాపాడటం కోసం అభి ఏం చేస్తాడు? ఏం చేయబోతున్నాడు? 'కళ్యాణ వైభోగం' సీరియల్ లో మంగళవారంనాటి ఎపిసోడ్ ముగింపు ప్రేక్షకులను మునివేళ్లపై ఉంచిందని చెప్పాలి. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియళ్లలో జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమయ్యే 'కళ్యాణ వైభోగం' ఒకటి.

అన్నాచెలెళ్లు అభి, దివ్య సహా వాళ్ళ కుటుంబ పతనమే పరమావధిగా, తన ప్రాణరక్షణే ధ్యేయంగా నిత్యా శ్రీనివాస్ వేసిన పథకం ఫలించింది. దివ్య కుటుంబానికి ఉన్న శాపం ప్రకారం... ఆ ఇంటికి వచ్చే కోడలు మరణిస్తుంది. కానీ, ఈసారి శాపం దివ్యకు కూడా ఉందని పురోహితులు చెబుతారు. అది తెలిసిన చారి పక్షవాతం బారినపడి మంచానికి పరిమితం అవుతాడు. మరోవైపు శాపం గురించి నిత్యా శ్రీనివాస్ చెవిన పడిన సంగతి తెలిసిందే. అదేంటంటే... దివ్య ప్రాణాలతో ఉండాలంటే ఆమెకు పెళ్లి కాకూడదు. పెళ్ళైతే మరణిస్తుంది. ఒకవేళ దివ్యకు పెళ్లి కాకపోతే నిత్యా శ్రీనివాస్ మరణిస్తుంది. ఇది తెలుసుకున్న నిత్యా, అక్క కూతురు మెడలో మూడు ముడులు పడేలా పావులు కదుపుతుంది. చాణక్యకు కోపం వచ్చేలా చేసి, అతడిని దివ్య ఇంటికి పంపిస్తుంది.

ఆవేశంతో దివ్య, అభిల ఇంటికి వెళ్లిన చాణక్య... దివ్య మెడలో తాళి కడతాడు. శాపం గురించి దివ్య, ఇతర కుటుంబ సభ్యులకు తెలియనప్పటికీ... అభికి తెలుసు. తన ముందే చెల్లెలు మెడలో మూడు ముడులు పడటంతో షాక్ తింటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. మరి, తర్వాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. సీరియల్ లో మేజర్ ట్విస్ట్ ఇది. ఇప్పుడు దివ్య మరణం తథ్యమా? చెల్లి ప్రాణాలు అభి కాపాడలేడా? అని అందరూ చర్చల్లోకి దిగారు. రాబోయే రోజుల్లో సీరియల్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.