English | Telugu

బొచ్చు వెనక్కి రాదు... ఖుష్బూ లేచి వెళ్లిపోయారు!

స్మాల్ స్క్రీన్ మీద నవ్వుల్నీ పండించే షో జబర్దస్త్. ఈ షోలో స్కిట్స్ ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయి. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా తగ్గేదేలే అన్నట్టుగానే ఉంటుంది. ఐతే ఈ షోలో ఎప్పుడైనా కంటెంట్ లేనప్పుడో లేదా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడో ఆడియన్స్  మైండ్ ని డైవర్ట్ చేసే ఎన్నో జిమ్మిక్కులు చేస్తారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది..ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అందులో మహేష్ బాబు, తాళ్ళూరి రామేశ్వరి నటించిన "నిజం" మూవీని స్పూఫ్ గా చేసి బులెట్ భాస్కర్, నాటీ నరేష్ టీమ్ స్కిట్ వేశారు. ఇందులో గోపీచంద్ గా బుల్లెట్ భాస్కర్, మహేష్ బాబుగా నరేష్ కనిపించారు. గోపీచంద్ పాత్రలో భాస్కర్ “పెద్దమ్మ తల్లికి అమ్మోరు తల్లిని బలి ఇవండ్రా” అని అంటాడు..అప్పుడు జడ్జి కృష్ణభగవాన్ మధ్యలో కలగజేసుకుని "గుండు ఫస్ట్ నుంచి ఉండాలి సర్ ఇప్పుడు గుండు సెటప్ పెట్టుకోవడం కష్టం సర్" అంటాడు భాస్కర్. ఇక కుష్బూ కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు.

 

"స్పూఫ్  చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ ఫీల్ అవ్వడానికి ఏం లేదు కదా” అన్నారు. ఆ మాటలకూ భాస్కర్ కు కోపంవచ్చేసింది  “ నేను స్కిట్ కోసం ప్రాణమిస్తా, అలాంటిది జుట్టు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు గుండు అన్నారు కాబట్టి  గుండులోనే స్కిట్ చేసి  చూపిస్తా” అంటూ స్టేజి మీదే గుండు గీయించుకుని అందరినీ షాక్ కి గురి చేశాడు. గుండు గీయించుకున్న మధ్యలో భాస్కర్ జడ్జెస్ వంక చాల కోపంగా ఒక చూపు చూసారు. గుండు గీయించుకున్నాక  “ఇప్పుడు ఓకేనా సార్” అంటూ  కృష్ణ భగవాన్‌ను అడిగాడు భాస్కర్. “ఆ ఎఫెక్ట్ కావాలన్నాం కానీ.. నిజంగా గుండు గీయించుకుంటే ఎలా ?” అని భగవాన్ రిప్లై ఇచ్చేసరికి భాస్కర్ ఇంకా సీరియస్ గా  “ఈ విషయాన్ని మీరు గుండు గీయించుకోక ముందు చెప్పాలి.. అంతా అయిపోయాక ఇప్పుడు బొచ్చు వెనక్కి రాదు ?” అంటూ గట్టిగానే జవాబిచ్చాడు. భాస్కర్ మాటలపై కుష్బూకు  కోపం వచ్చేసింది . “మాకు ఓ రెస్పాన్స్‌బులిటీ ఇచ్చారు. అందుకే ఇక్కడ కూర్చోబెట్టారు. ఆమాత్రం చెప్పే  ఫ్రీడమ్ లేదంటే ఎలా ?” అంటూ చాల ఘాటుగా అడిగారు ఖుష్బూ. "ఒక జడ్జిగా మాకు ప్రశ్నించే హక్కు  లేదంటే, మేమెందుకు ఇక్కడ ఉండాలంటూ" సీటులో నుంచి లేచి వెళ్లిపోయారు ఇద్దరు జడ్జెస్ . “థాంక్యూ మేడం” అంటూ భాస్కర్ కూడా స్టేజి మీద నుంచి వెళ్ళిపోయాడు.