English | Telugu

Krishna Mukunda Murari: అవును వాళ్ళిద్దరు ఒక్కటయ్యారు.. పెద్దమ్మ చూసేసిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -321 లో.. రేవతిని భవాని పిలిచి.. మళ్ళీ ఆ కృష్ణ ఏదో ప్లాన్ చేస్తుందట, ముకుందతో త్వరగా అమెరికా వెళ్ళండని చెప్తుందట, ఎందుకని అడుగగానే.. రేవతి షాక్ అవుతుంది. ఏమో తెలియదు. కృష్ణ మాకేం చెప్పలేదని రేవతి, మధు చెప్తారు.

ఆ తర్వాత కోర్ట్ హియరింగ్ ఉందేమో.. ఎక్కడ వాళ్ళ తప్పు తెలిసిపోతుందని ఇలా చేస్తుందేమో.. దాని గురించి నేనే కనుక్కుంటానని భవాని చెప్తుంది. మరొకవైపు కృష్ణ అన్న మాటలు మురారి గుర్తుకు చేసుకొని.. ఒక్క రోజు కూడా కృష్ణని చూడకుండా ఉండలేకపోతున్న అమెరికాకి వెళ్తే ఎన్ని రోజులు పడుతుందోనని మురారి అనుకుంటాడు. మరొక వైపు శకుంతలతో కలిసి కృష్ణ భోజనం చేస్తుంటుంది. వంటలు చాలా బాగున్నాయంటూ కృష్ణ తింగరి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే.. రేవతి మధు, నందు, గౌతమ్ అక్కడికి వస్తారు. వాళ్ళు మురారిని ఎందుకు త్వరగా అమెరికా పంపించాలని చూస్తున్నావని  కృష్ణ పై కోపంగా ఉంటే.. కృష్ణ సరదాగా మాట్లాడుతుంది‌. రేవతికి మరింత కోపం వస్తుంది. కాసేపటికి మురారిని కృష్ణ అమెరికా ఎందుకు వెళ్ళమని అంటుందోనని చెప్తుంది. మురారి అమెరికా వెళ్తే గతం గుర్తుకు వస్తుంది.  ఇప్పుడు గతం గుర్తుకు రాకుండానే నాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత గతం గుర్తుకు వస్తే మురారి నాతోనే ఉంటాడు కదా అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు ముకుంద దగ్గరికి మురారి వెళ్తాడు. ముకుంద మనం అమెరికా నుండి రావడానికి ఎంత టైమ్ పడుతుందని అనగానే.మ ఎవరు అడగమన్నరు కృష్ణనా అని ముకుంద అనగానే కృష్ణనే నన్ను వెళ్లమని చెప్పిందిని మురారి చెప్తాడు.

మరొక వైపు కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. భవాని దగ్గరికి తీసుకొని వెళ్తాడు. "నాకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ తో కృష్ణ మాట్లాడుతుంది. ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని కృష్ణ వాళ్ళు మాట్లాడుకుంటారు నెంబర్ ఇవ్వండి" అని భవానితో మురారి అనగానే.. నెంబర్ క్రిమినల్ కి ఇస్తే ఎలా అని, ఇవ్వను ఆ నెంబర్ కాన్ఫిడెన్శియల్ అని భవాని చెప్తుంది. ఆ తర్వాత త్వరగా రండి అని మురారికి  కృష్ణ చెప్పి వెళ్లిపోతుంది. తరువాయి భాగంలో‌‌.. మురారికి కృష్ణ అన్నం తినిపించడాన్ని భవాని చూస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.