English | Telugu
భార్య మాటకి విలువనిచ్చిన భర్త.. కొత్తగా మొదలైందా?
Updated : Nov 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -320 లో.. కృష్ణ ఒడిలో మురారి నిద్రపోతు తెల్లవారిందన్న విషయం మర్చిపోతాడు. కాసేపటికి కృష్ణ నిద్ర లేపుతుంది. పూర్తిగా కృష్ణ ప్రేమలో ఉన్న మురారి నాకు గతం గుర్తుకు రాకుండా ఉంటేనే బాగుండనిపిస్తుందని మురారి అనగానే.. కృష్ణ మొహం డల్ అవుతుంది.
కృష్ణ దగ్గర నుండి మురారి రావడం చుసిన రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకవైపు భవాని మాట్లాడిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు మురారి. అప్పుడే భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. నిన్న మురారి మనల్ని అడిగిన ప్రశ్నలు కృష్ణని ఎందుకు అడగలేదని ముకుందతో భవాని అంటుంది. మనపైన ఇంత కోపంగా ఉంటున్నాడు. ఆ కృష్ణతో సరదాగా ఉంటున్నాడని భవానీతో ముకుంద చెప్తుంది. వాళ్ళని కలవనియకూడదు. వీలైనంత త్వరగా అమెరికాకి పంపించాలని భవాని అనుకుంటుంది. ఒకవైపు కృష్ణ ముగ్గు వేస్తుంటే మురారి వచ్చి సరదాగా మాట్లాడతూ తను కూడా ముగ్గు వేస్తాడు. అదంతా ముకుంద చూస్తుంటుంది. మరొకవైపు మధు, రేవతిలతో భవాని మాట్లాడుతుంది. మధు మీరు ఆ కృష్ణకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. తప్పు చేసిందని నేను అంటున్నా దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తప్పు చెయ్యలేదని అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని భవాని వాళ్లని అడుగుతుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గర నుండి మురారి వస్తాడు. ఎక్కడకి వెళ్ళావని మురారిని భవాని అడుగుతుంది. తల తిరిగినట్లు గా ఉందని మురారి అంటాడు. అంటే కృష్ణ దగ్గరికి వెళ్ళావా? సరే లోపలికి వెళ్ళమని భవాని సాధారణంగా మాట్లాడుతుంది.
కాసేపటికి భవాని కోపంగా మధు, రేవతిలతో మాట్లాడుతుంది. ముకుంద మురారిలని త్వరగా అమెరికా పంపించాలని అనగానే ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వచ్చి.. అమెరికా మూడు రోజుల్లో వెళ్తున్నామని చెప్పగానే వీలైతే ఈ రోజు వెళ్ళండని కృష్ణ అనగానే.. ముకుంద షాక్ అవుతుంది.. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. అమెరికా వెళ్ళాలని లేదని అనగానే.. వెళ్ళండి సర్ అని మురారికి కృష్ణ చెప్తుంది. అలా చెప్పగానే నువ్వు చెప్పావ్ కాబట్టి వెళ్తున్నా అని మురారి అంటాడు. కృష్ణ, మురారి మాట్లాడుకున్న మాటలన్నీ విని భవానికి చెప్తుంది ముకుంద. అప్పుడు భవాని కోపంగా రేవతిని పిలిచి.. ఆ కృష్ణ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది? వీలైతే ఈ రోజే వెళ్ళండని ముకుందతో కృష్ణ అంటుందంట అని భవాని చెప్పగానే.. రేవతి షాక్ అవుతుంది..ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.