English | Telugu
అక్రమ సంబంధం.. అప్పు సూసైడ్!
Updated : Nov 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -259 లో... అరుణ్ కి రాహుల్ ఫోన్ చేసి స్వప్నని డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయమని చెప్తాడు. దాంతో స్వప్నకు అరుణ్ ఫోన్ చేస్తాడు. స్వప్న మాత్రం మళ్ళీ ఎందుకు కాల్ చేసావ్ రా ఇడియట్? నీకు నాకు ఏం సంబంధం ఉందంటూ తిడుతుంది. అక్రమ సంబంధం ఉందని అరుణ్ అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్? మనం ఫ్రెండ్స్ మాత్రమే అని స్వప్న అంటుంది. నువ్వు ఇప్పుడు పది లక్షలు డబ్బులు తీసుకొని రాకపోతే మనం ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలన్నీ గ్రాఫిక్స్ చేసి పంపిస్తానని అరుణ్ అంటాడు.
నువ్వు ఇప్పుడు పది లక్షలు తీసుకొని వస్తే ఇక నీ జోలికి రానని అరుణ్ చెప్తాడు. దానికీ స్వప్న కూడా సరేనని అంటుంది. ఇప్పుడు పది లక్షలు ఎక్కడ నుండి తీసుకొని రావలని స్వప్న టెన్షన్ పడుతుంది. అదే సమయంలో స్వప్న టెన్షన్ పడడం చూసిన రాహుల్ , రుద్రాణి ప్లాన్ సక్సెస్ అని హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు కళ్యాణ్ ని అప్పు మర్చిపోలేక ఏమైనా చేసుకుంటుందని అనుకొని అప్పుని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది కనకం. మరొకవైపు రాజ్ కి ఎస్సై ఫోన్ చేసి అరుణ్ గురించి తెలిసిన విషయాలు చెప్తాడు. అరుణ్ మీ ఇంటి కోడలు స్వప్న కాలేజీ ఫ్రెండ్.. డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతకు మించి బ్యాడ్ గా లేదని ఎస్సై అంటాడు. కావ్య చెప్పింది కరెక్టే.. నేనే స్వప్నని తప్పుగా అర్థం చేసుకున్ననా అని రాజ్ అనుకుంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. రాజ్ వెటకారం మాటలకి కావ్య సెటైర్ లు వేస్తుంటుంది. మరొక వైపు కనకం చెప్పిన పనులన్ని అప్పు చేస్తుంటుంది. ఏంటి అప్పుకి పని చెప్తున్నావ్. అది ఖాళీగా ఉండి కళ్యాణ్ ఆలోచనతో ఏమైనా చేసుకుంటుందనా అని కనకాన్ని అన్నపూర్ణ అడుగుతుంది. " దానిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు కూడా దాని మనసు మార్చడానికి ప్రయత్నం చేయు" అని అన్నపూర్ణకి కనకం చెప్తుంది. తెల్లవారింది కాఫీ పెడదామని వంటింట్లోకి వెళ్తుంది కనకం. పాలు వంటింట్లో అప్పటికి ఉండవు ఇదేంటి అప్పు ఇంకా పాలు తీసుకురాలేదు పాలు తీసుకు రమ్మని చెబుదామని అప్పు రూమ్ కి వెళ్తుంది. అప్పు చేతికి మణికట్టు దగ్గర గీత ఉంటుంది. అది చూసి వెంటనే కనకం షాక్ అవుతుంది. అప్పు సూసైడ్ చేసుకుందని భయపడుతుంది.
మరొకవైపు స్వప్న టెన్షన్ పడుతుంటే.. రాహుల్ వచ్చి ఏమైంది ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఏం అవసరం లేదని స్వప్న చెప్తుంది. రేపటి లోగా పది లక్షలు ఎలా తీసుకొని రావాలని టెన్షన్ పడుతుంది. ఒకవైపు రాజ్ డోర్ వేస్తుంటే ఆ డోర్ వెనక్కి వచ్చి రాజ్ ముక్కుకి తాకూతుంది. దాంతో అది చూసిన కావ్య నవ్వుతుంటే.. రాజ్ కి కోపం వస్తుంది. తరువాయి భాగంలో.. రాహుల్ ఇంట్లో అందరి ముందు స్వప్న ఎవరితోనో తిరుగుతుందంటూ ఫొటోస్ చూపిస్తాడు.. ఆ తర్వాత అతను నాకు ఫ్రెండ్ అని స్వప్న చెప్పగానే ఆ రోజు ఫోటో చూపించి అడిగితే.. అతను నాకు తెలియదని చెప్పావని ఇందిరాదేవి అనగానే.. ఇంట్లో అందరు షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగింది.. అప్పు నిజంగానే సూసైడ్ చేసుకుందా, లేదా అని తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.