Read more!

English | Telugu

Krishna Mukunda Murari : మీకు వేరే దిక్కులేదు.. ఆదర్శ్ తో మీ కూతురి పెళ్ళి చేసే భాద్యత నాది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -437 లో.. ఇంట్లో రజినీ.. ఆస్తిని సొంతం చేసుకునే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అటుగా వెళ్లడం చూసిన రజినీ.. హేయ్ పిల్లా ఇలారా అని మర్యాద లేకుండా పిలుస్తుంది. అయిన కృష్ణ మర్యాదగా వచ్చి.. ఏంటి పిన్నీ అంటుంది. అవును ఆ ముకుంద ఎలా చనిపోయిందని‌ రజని అడుగుతుంది. తిక్కరేగిన కృష్ణ.. అంతా చనిపోయినట్లే చనిపోయింది. ప్రాణం గాలిలో కలిసిపోయిందంటు తిక్క తిక్కగా సమాధానం చెబుతుంది. దాంతో రజినీ రెచ్చిపోతూ.. ఏంటి నేనంటే నీకు భయం లేదా.. మర్యాద లేదా అంటూ అందరిని పిలిచి రచ్చ చెయ్యాలని చూస్తుంది. అంతా బయటికి వస్తారు. 

అప్పుడే రజనీ గొడవ పెద్దది చేస్తుంటే తట్టుకోలేకపోయిన భవాని.. " రజినీ.. ఇప్పుడు ముకుంద పెద్దకర్మ చేసి వచ్చాం.. దాని పిండం కాకులు కూడా ముట్టలేదు.. మేమంతా అదే బాధలో ఉన్నాం. గొడవ చేయొద్దు.. ఏదైనా అవసరం ఉంటే రేవతిని అడుగు.. కృష్ణ ఆవిడితో కాస్త జాగ్రత్తగా ఉండు " అని అంటుంది. అయితే అప్పుడే మీరా తన నటనని మొదలెడుతుంది. ఏడుస్తూ కుర్చీలో కూలబడిపోతుంది. వెంటనే ఆదర్శ్, కృష్ణ కంగారుపడతారు. ఏమైంది మీరా అంటూ ఆదర్శ్.. ముకుందను అడుగగా.. ఇందాక ముకుందకు పిండం పెట్టేటప్పుడు ముకుంద వాళ్లనాన్న ఒక మాట అన్నారు.. నా కూతురు చనిపోలేదమ్మా నీలోనే ఉందని. ముకుందను చూసినట్లే నన్ను చూసేవారు. అందుకే నాలోని ఆయన కూతుర్ని చూసుకుంటానన్నారు. కానీ నేను ముకుంద అని ఎవరిని పిలవాలి ఆదర్శ్ గారు.. ముకుంద అన్న మాట ఎక్కడ వినాలి నేను.. ఈ బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది కదా ఆదర్శ్ గారు అని మీరా ఏడుస్తుంది. అది చూసిన కృష్ణ.. మీరా ఊరుకో అని ఓదారుస్తుంది. మనకు కావాల్సినవాళ్లు పోతే ఇలానే ఉంటుంది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆ గుర్తులు ఆ మనసులు మెల్లగా మరుగున పడిపోతాయి. అంత వరకూ వాటిని మోయక తప్పదని భవాని అంటుంది. అవసరం లేదమ్మా.. ఏది మరిచిపోవాల్సిన అవసరంలేదు.. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తించుకునే దారి ఉందని ఆదర్శ్ అంటాడు. ఏమన్నావ్ మీరా.. ముకుంద పేరుని ఎప్పుడు వినాలి ? ఎక్కడ వినాలని అన్నావ్ కదా? ఇప్పుడే వింటావ్.. ఇక్కడే వింటావ్.. సరిగ్గా విను మీరా.. అంతా వినండి. ఈ క్షణం నుంచి తన పేరు మీరా కాదు ముకుంద అని ఆదర్శ్ అంటాడు.

ఆదర్శ్ మాటలకు అంతా బిత్తరపోయి చూస్తుంటారు. అవును మీరా.. సారీ సారీ అవును ముకుంద.. ఈ రోజు నుంచి నీ పేరు మీరా కాదు ముకుంద.. అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని  ఆదర్శ్ అంటాడు. అదికాదు బ్రో.. ముకుంద అనే పేరు వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయో తెలుసు కదా.. మీరా అనే పేరు బాగానే ఉంది కదా అని మధు అంటాడు. తనకి బాలేదు.. ముకుంద అనే పేరు వినలేకపోవడం తనకు అసలు బాలేదు. అయిన ముకుంద తండ్రి ముకుందను మీరాలో చూసుకున్నప్పుడు మీకేంటి సమస్య అని ఆదర్శ్ అంటాడు. అమ్మా.. నువ్వేం మాట్లాడవా? నేనేదో ముకుంద మీద ప్రేమతో మాట్లాడటం లేదమ్మా.. అసలు ముకుంద అంటే మీకు ఎవరికీ ఇష్టం లేదని తెలుసు. కానీ మీ అందరికీ మీరా అంటే ఇష్టమే కదా అని ఆదర్శ్ అంటాడు. అందరికీ ఇష్టమే ఆదర్శ్.. కానీ తనకు ముకుంద పేరు ఎందుకని మధు అంటాడు. ఎందుకంటే తనకు ముకుంద అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఏమంటావ్ అమ్మా? ప్లీజ్ అమ్మా ఈ ఒక్కదానికైనా ఒప్పుకో..మీరా మనసులోని బాధను తగ్గిద్దాం అమ్మా అని ఆదర్శ్ అంటాడు. కాసేపటికి రజినీ, సంగీతలున్న రూమ్ లోకి మీరా వస్తుంది. మగాడు మరిచిపోవడం.. మారిపోవడం ఎంత సేపు పిన్నిగారు.. ఇప్పుడు ఇలా నిరుత్సాహాపడిపోతే ఎలా.. వరస పెట్టి పిలిచినందుకు ఏం అనుకోవద్దని మీరా అంటుంది. వరస పెట్టి పిలిస్తే ఏం అనుకోను కానీ.. నీ వరసే బాలేదు. చచ్చిపోయిన వాడి పెళ్లాం పేరు నీకు పెట్టాడు. ఇక నా కూతురు వంక ఎందుకు చూస్తాడు? పైగా పేరు పెట్టగానే నువ్వు కూడా తలూపావ్..నీ మనసులో ఏముందని రజినీ అంటుంది. అయ్యో పిన్నీగారు మీరు అలా ఏం అనుకోవద్దు.. నాకు నిజంగానే ఆ ఉద్దేశం ఉంటే సాయం చేస్తానని మీకెందుకు చెబుతాను? ముందు మీరు నాకు ఒక మాట చెప్పండి.. ఎలాగైనా మీ అమ్మాయిని ఈ ఇంటికి కోడల్ని చెయ్యాలనుకుంటున్నారా లేదా అని రజినీతో మీరా అంటుంది. ఎక్కడికి పోయేది.. ఇక్కడ ఈ ఇల్లు తప్ప నాకు మా అమ్మకు వేరే దిక్కులేదని సంగీత అంటుంది. " ఆదర్శ్‌తో నీ కూతురు పెళ్లి చేసే బాధ్యత నాది " అంటూ సంగీత, రజినీలకు మాటిస్తుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.