Read more!

English | Telugu

Krishna Mukunda Murari : మురారి వల్లే ముకుంద చనిపోయిందని అరెస్టు చేసిన పోలీసులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -421 లో.. నేనేమైనా తప్పు చేసానా ముకుందకి చాలా సార్లు నచ్చజెప్పానని.. అసలు వినలేదని మురారి అనుకుంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి.. మీదేం తప్పు లేదని చెప్తుంది. ముకుందని ఆదర్శ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ముకుంద కేవలం ఒక పరిచయస్తురాలు.. ఆదర్శ్ భార్యగానే చూసాను. అంతకు మించి నేను తప్పుగా ఆలోచించలేదు.. నువు నన్ను నమ్ముతున్నావ్ కదా అని కృష్ణతో మురారి అంటాడు.

మీపై నమ్మకం లేకుంటే నాపై నాకే నమ్మకం ఉండదని కృష్ణ అనగానే.. కృష్ణని మురారి హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రేవతి, నందు, సుమలతలు ఆలోచిస్తుంటారు. అసలు కృష్ణని ఆదర్శ్ పూర్తిగా అపార్థం చేసుకుంటున్నాడని అనుకుంటారు. అప్పుడే మధు వచ్చి‌. అదే విషయం గురించి డిస్కషన్ చేస్తుంటాడు. ఆ తర్వాత కృష్ణకి పరిమళ ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్ హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది రమ్మని కృష్ణతో పరిమళ చెప్తుంది. నేను రాలేని సిచువేషన్ లో ఉన్నానని, ఇక్కడ ఏం  బాలేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత పరిమళతో మురారి మాట్లాడుతాడు. ఎలాగైనా కృష్ణని ఆ ఓపెనింగ్ కి తీసుకొని రమ్మని మురారీతో పరిమళ చెప్తుంది. దానికి మురారి సరేనని చెప్తాడు. ఆ తర్వాత మధు నైట్ డ్రింక్ చేస్తు.. ముకుంద చేసిన పనికి తిడుతుంటే అపుడే ముకుంద వస్తుంది. ముకుంద దెయ్యంలాగా వచ్చి మధుని భయపెడుతుంది.

ఆ తర్వాత ముకంద ఆత్మలాగా వచ్చి మురారితో మాట్లాడుతుంది. ముకుంద మాటల్లో కృష్ణని దగ్గరకు రానివ్వనని చెప్పినట్టు మురారికి క్లియర్ గా అర్థం అవుతుంది. ముకుంద మాటలు ఎక్కడ నుండి వినిపిస్తున్నాయంటు మురారి వెతుకుతుంటాడు.ఆ తర్వాత ముకుంద దెయ్యంగా వచ్చిందంటు మధు భయపడుతుంటాడు. కాసేపటికి ఆదర్శ్ బయటకు వెళ్తుంటే.. వద్దని రేవతి ఆపుతుంది. నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరా అంటు అరుస్తాడు. అప్పుడే మురారి వస్తాడు. కృష్ణని ఏదో మాటలు అన్నాడని ఆదర్శ్ తో మురారి గొడవపడుతుంటాడు. అప్పుడే మురారికి కావలనే ముకుంద కనిపిస్తుంది. నువ్వు అలా భయపడటమే కావాలని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి మాట్లాడుకుంటారు. కృష్ణకి దగ్గరగా ఉంటే ముకుంద ఈ రూపంలో ఇలా చేస్తుందా.. ఏం చేసినా నేను కృష్ణకి దగ్గరగా ఉంటాను.. ఎందుకు భయపడాలని మురారి అనుకుంటాడు. తరువాయి భాగంలో ముకుంద తనవల్లే చనిపోయిందని పోలీసులు మురారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రూపం మార్చుకున్న ముకుంద.. నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.