Read more!

English | Telugu

Karthika Deepam2 : దీపని ఇంట్లో నుండి గెంటెయ్యడానికి రంగం సిద్ధం.. కార్తిక్ అడ్డుకుంటాడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 31 లో....అసలు ఎందుకు ఇలా చేసావ్? సిచువేషన్ బాలేదని ఒక ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదా అని జ్యోత్స్నతో అంటాడు. నీకు ఫోన్ వస్తనే కదా నువ్వు వెళ్లిపోయావ్ ? అసలు నీ మీద కోపంతోనే ఇలా చేసాను. పెళ్లి అయ్యాక కూడా నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా అంటు కార్తీక్ ని జ్యోత్స్న అడుగుతుంది... నాకు నీపై అలాంటి ఉద్దేశం లేదని జ్యోత్స్నకి చెప్పడం బెటర్.. ఏది ఏమైనా ఇప్పుడు చెప్తానని కార్తీక్ అనుకుంటాడు.

కార్తీక్ చెప్పబోతుంటే.. అప్పుడే జ్యోత్స్నకి దీప పాలు తీసుకొని వస్తుంది. దీపని జ్యోత్స్న కోపంగా చూసి.. అక్కడ పెట్టి వెళ్ళమని అంటుంది. దీప వెళ్తుంటే తను నిజం చెప్పిన విషయం గుర్తుకుచేసుకొని పాల గ్లాస్ కింద పడేస్తుంది జ్యోత్స్న. అప్పుడు దీప దగ్గరికి కార్తిక్ వస్తాడు. నన్ను వదిలెయ్యండి అంటూ జ్యోత్స్న డోర్ వేసుకుంటుంది. జ్యోత్స్న ఏదో కోపంలో చేసిందంటాడు కార్తిక్.  ఆ పగిలిన వాటిని దీప క్లీన్ చేస్తుంటే.. పనిమనిషి క్లీన్ చేస్తుందిలే దీప అని కార్తిక్ అంటాడు. మీ జాలి నాకు అవసరం లేదని దీప అంటుంది. జ్యోత్స్నకి నిజం చెప్పకుండా పారు ఏం చేస్తుందని పారిజాతం దగ్గరికి కార్తిక్ కోపంగా వస్తాడు. నిన్ను రెండు విషయాలు అడగాలి.. మొదటిది జ్యోత్స్న తప్పు చేసినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావ్? నువు అలా చెయ్యడం వాళ్ళ.. నేనేం తప్పు చెయ్యలేదని తను అనుకుంటుంది. ఇంకొకటి జ్యోత్స్న అంటే నాకు ఇష్టం లేదన్న విషయం ఇంకా ఎందుకు తనకి చెప్పలేదని అంటాడు. ఇప్పుడు సిచువేషన్ బాలేదు కదా.. అందుకే అని పారిజాతం అంటుంది. నేను ఇప్పుడు ఇంట్లో అందరికి చెప్తానని కార్తీక్ అంటాడు. నువ్వు అలా చెప్తే జోష్నా సూసైడ్ చేసుకుంటుంది.. టైమ్ చూసుకొని చెప్పాలని పారిజాతం అంటుంది. మీ అందరిలాగే జ్యోత్స్న బాగుండాలని నేను అనుకుంటున్నానని కార్తీక్ చెప్పేసి వెళ్ళిపోతాడు.. ఆ మన అలా బాగుండాలంటే నువు దాని జీవితంలో ఉంటేనే ఉంటుంది.. అలా ఉండేలా నేను చేస్తాను కదా అని పారిజాతం అనుకుంటుంది.

అ తర్వాత జ్యోత్స్నకి చాలా కోపం గా ఉంది.. ఇప్పుడు తన మాటలేం పట్టించుకోకని దీపతో సుమిత్ర అంటుంది. మరొకవైపు దీప వల్లే ఈ ఇంటి పరువుపోయిందంటూ దీపని ఇంట్లో నుండి పంపియ్యాలని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ ఇంటికి వెళ్ళగానే.. తన పేరెంట్స్ జ్యోత్స్న గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.