Read more!

English | Telugu

Karthika Deepam2 :  తండ్రి ఎఫైర్ ని కళ్ళారా చూసేసిన కొడుకు.. ఏం చేయనున్నాడు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -103 లో..  కార్తిక్, దీప మాట్లాడుకుంటారు. జోత్స్నకి మీరంటే ప్రాణం.. మిమ్మల్ని తప్ప వేరొకర్ని భర్తగా ఊహించుకోలేదు.. చిన్నప్పటి నుంచి మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్లు మన జీవితంలోకి వస్తే జీవితం ఎంతో బాగుంటుంది.. ఈ పెళ్లి వద్దనడానికి మీ దగ్గర కారణాలు లేవు.. కానీ ఈ పెళ్లి చేసుకోవడానికి జోత్స్నకి వంద కారణాలు ఉన్నాయి.. మీ పెళ్లి అనేది మీ రెండు కుటుంబాల కల.. మేనకోడల్ని కోడల్ని చేసుకోవాలని మీ అమ్మ గారు ఎంత ఆరాటపడుతున్నారో నాకు తెలుసు కార్తీక్ బాబు.. మీ అమ్మగారిని సంతోషపెట్టడం కొడుకుగా మీ బాధ్యత.. అని కార్తిక్ తో దీప అంటుంది.

ఇక కార్తిక్ ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. దీప మాట్లాడిన మాటలే తల్చుకుంటు కార్తిక్ కారులో వెళ్తుండగా.. అతనికి శ్రీధర్, అతని రెండో భార్య, కూతురు స్వప్న కనిపిస్తారు. ఈవిడ స్వప్న అమ్మ గారు కదా.. నాన్న మాట్లాడుతున్నాడేంటి? డాడీకి స్వప్న వాళ్ల అమ్మ ఎవరో తెలియదు కదా.. అని అనుమానిస్తూ చూస్తాడు. ఇంతలో స్వప్న వచ్చి.. నాకు ఈ షాప్‌లో ఏం నచ్చలేదు డాడ్ అని అంటుంది. మమ్మీ షాపింగ్ అయిపోతుంది డాడ్.. నా షాపింగే మిగిలింది అని స్వప్న అనడంతో.. ఆ మాటలు కార్తీక్‌కి వినిపిస్తాయి. ఆ మాటలు విని కార్తీక్‌ షాక్ అవుతాడు. నాన్నని డాడీ అంటుందేంటు కార్తిక్ జరిగింది మొత్తం గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

కార్తిక్ కి మొత్తం విషయం అర్థమవుతుంది. తన తండ్రి శ్రీధర్.. ఇంట్లో ఇల్లాలును పెట్టుకుని.. పక్క వీధిలో ప్రియురాలిని పెట్టుకున్నాడని కార్తీక్‌కి మొత్తం అర్ధం అయిపోతుంది. స్వప్న తండ్రి.. నా తండ్రి ఒక్కరేనా? అని వాళ్ల ముగ్గురూ కలిసి ఉన్న ఫొటోని తీస్తాడు కార్తీక్. ఆ తర్వాత తన తండ్రి చేస్తున్న మోసాన్ని తల్చుకుని భోరున ఏడుస్తాడు కార్తీక్. తలని కారుకేసి కొట్టుకుంటాడు. ఆ తర్వాత దూరంగా వెళ్లి తన తండ్రి గురించే ఆలోచిస్తుంటాడు. కన్ఫమ్ చేసుకోవడానికి స్వప్నని కలుస్తాడు. అయితే స్వప్న వచ్చి.. మా డాడీతో షాపింగ్‌కి వెళ్లాను ఈరోజు అని చెప్పడంతో కార్తీక్‌ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.