English | Telugu

Eto Vellipoyindhi Manasu : సందీప్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రామలక్ష్మి.. సీతాకాంత్ అర్థం చేసుకోగలడా!

 

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -155 లో.....రామలక్ష్మికి తన క్యాబిన్ చూపిస్తాడు సీతాకాంత్. నీకేం కావాలన్నా అలా చిటికెస్తే ఇలా వస్తాయని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ ప్రేమగా చూస్తుంటే తన లవ్ మ్యాటర్ చెప్తాడేమో అని రామలక్ష్మి అనుకుంటుంది.  నువ్వు ఇంటిని బాగా చూసుకుంటున్నావ్.. ఈ కంపెనీని కూడా చూసుకుంటావని ఆశ పడుతున్నానని సీతాకాంత్ రామలక్ష్మికి అల్ ది బెస్ట్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ తన క్యాబిన్ లో నుండి రామలక్ష్మిని ప్రేమగా చూస్తుంటాడు.

ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి సీతాకాంత్ వచ్చి.. నువ్వు మేనేజర్ కావాలి. ఇదంతా అన్యాయమని అంటాడు. అప్పుడే నాకు వేడి వేడి కాఫీ కావాలని అంటుంది నమిత. అయితే నువ్వే తెచ్చుకోపో అంటాడు. ఆ తర్వాత నిజంగా మీరు లక్కీ మేడమ్.. సీతాకాంత్ సర్ ని ఎంత మంది ట్రై చేసారో మీరు భలే పడేసారని నమిత అంటుంది. సర్ కి నేను కూడా స్పెషల్ అని నమిత అనగానే.. రామలక్ష్మి డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు సందీప్ తన క్యాబిన్ లోకి వెళ్తాడు. అసిస్టెంట్ మేనేజర్ ని రమ్మని చెప్పండి అని సందీప్ అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి క్యాబిన్ కి వచ్చి.. సందీప్ పిలిచావాట అని అడుగుతుంది. సందీప్ ఏంటి నీ బాస్ ని సర్ అను అని కోప్పడతాడు. ఈ ప్రాజెక్ట్ స్టడీ చేసి నాకు హాఫ్ అన్ అవర్ లో ఇవ్వాలి రామలక్ష్మి అనగానే.. నేను మిస్సెస్ సీతారామలక్ష్మి. మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండని రామలక్ష్మి కౌంటర్ వేస్తుంది. రామలక్ష్మి కూర్చొబోతుంటే నేను కూర్చొమనే వరకు కూర్చొవద్దని సందీప్ అంటాడు. అప్పుడే సీతకాంత్ వచ్చి.. ఏంటి నిల్చున్నావ్ కూర్చోమని రామలక్ష్మిని కూర్చోపెడతాడు. ఇక్కడ అందరు సమానమే అని సీతాకాంత్ చెప్తాడు.

ఆ తర్వాత నమిత తలకి సీతాకాంత్ తల తాకగా కొమ్ములు వస్తాయంటూ మళ్ళీ తాకించమని నమిత అనగానే.. సీతాకాంత్ తాకిస్తాడు. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంది. అందులో న్యూ కంపెనీ కోసం ల్యాండ్ సజెస్ట్ చేయమని సీతాకాంత్ చెప్పగా.. సందీప్ సజెస్ట్ చేస్తాడు. అది వద్దంటూ పర్ఫెక్ట్ రీజన్ రామలక్ష్మి చెప్పగా.. సీతాకాంత్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. దాంతో రామలక్ష్మి పైన సందీప్ కోపంగా ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటే.. రామలక్ష్మి వంక సీతాకాంత్ ప్రేమగా చూస్తుంటాడు. పక్కనే ఉన్న నమిత తనని సీతాకాంత్ చూస్తున్నాడనుకొని సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.