English | Telugu

ఏకాంతంలో కార్తీక్.. నిజం చెప్ప‌డానికి వంట‌ల‌క్క ఎంట్రీ!‌

స్టార్ మా చానల్‌లో ప్ర‌సారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ 'కార్తీక దీపం'. ప‌రిటాల నిరుప‌మ్‌, ప్రేమి విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా టాప్ ట్రెండింగ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సీరియ‌ల్ రోజుకో మలుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ‌వారం తాజా ఎపిసోడ్ కీల‌క మ‌లుపు తిర‌గ‌బోతోంది. అస‌లు విష‌యం తెలుసోవాల‌ని తుల‌సి ఇంటికి వెళ్లిన కార్తీక్‌కి అక్క‌డ తుల‌సి లేక‌పోవ‌డంతో చిరాకొస్తుంది. ఇది కూడా దీప పార్టీనే క‌దా కావాల‌నే ఇలా చేసింద‌ని విసుక్కుంటాడు.

క‌ట్ చేస్తే.. విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని ఆ విష‌యాన్ని కార్తీక్‌కి చెప్పాల‌ని సౌంద‌ర్య ఎంత ప్ర‌‌య‌త్నించినా వినిపించుకోడు. దీంతో త‌న ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌డానికి దీప ఇంటికి వెళుతుంది సౌంద‌ర్య. అప్ప‌టికే డాక్ట‌ర్ బాబు త‌న‌ని ఇంటికి తీసుకెళ్ల‌డానికి వ‌స్తాడ‌ని, ఏ చీర క‌ట్టుకోవాల‌ని త‌న‌లో త‌నే మాట్లాడుకుంటుంటుంది వంట‌ల‌క్క‌.. ఇంత‌లో అక్క‌డికి చేరుకుంటుంది సౌంద‌ర్య‌. ఆమెని చూసిన వంట‌ల‌క్క "చెప్పారా? విన్నారా? న‌మ్మారా?" అని ఆత్రుత‌గా అడుగుతుంది. "చెప్పాను. ప‌ట్టించుకోలేదు.. నాకు అస్స‌లు స‌మాధాన‌మే చెప్ప‌లేదు" అంటుంది సౌంద‌ర్య.

దీంతో వంట‌ల‌క్క ఆనందం ఆవిరైపోతుంది. ఏడుస్తూ సోఫాలో వాలిపోతుంది. "అంత‌లా న‌న్ను విమ‌ర్శించే స‌వ‌తి త‌ల్లే మారింది. త‌ను కూడా మార‌తాడ‌ని అనుకున్నాను. కానీ అబ‌ద్ధాన్ని ప్రేమించినంత‌గా నిజాన్ని ప్రేమించ‌డం లేదు." అంటుంది వంట‌ల‌క్క‌. "వాడిలో అంత‌ర్మ‌థ‌‌నం మొద‌లైంది.. నువ్వు మాత్రం ఓర్పుగా, స‌హ‌నంతో వుండు." అంటుంది సౌంద‌ర్య‌.. త‌న‌లో స‌హ‌నం చ‌చ్చిపోయింద‌ని చెబుతుంది దీప‌.

"ఈ విష‌యం నేను కాదు నువ్వే చెప్పాలి. రేపు అంతా గుడికి వెళ్లిపోతాం. కార్తీక్ ఒంట‌రిగా ఏకాంతంగా వుంటాడు. ఆ స‌మ‌యంలో వ‌చ్చి చెప్పు వింటాడు." అంటుంది సౌంద‌ర్య‌. "స‌రే.." అని చెప్పిన వంట‌ల‌క్క సౌంద‌ర్య చెప్పిన‌ట్టే కార్తీక్ ఏకాంతంగా వుండ‌గా ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఈ విష‌యాన్ని మోనిత ముందే ప‌సిగ‌డుతుందా.. కార్తీక్‌ని అలెర్ట్ చేస్తుందా? ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.