English | Telugu

శౌర్య మాట‌ల‌తో కార్తీక్‌లో మార్పు?

బుల్లితెర ధార‌వాహిక `కార్తీక దీపం`. `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్స్‌లో టాప్ సీరియ‌ల్ అన‌డం కంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్స్‌లో టాప్ వ‌న్ రేటింగ్‌లో వున్న ఏకైక సీనియ‌ల్ ఇదే అని చెప్ప‌డం క‌రెక్టేమో అంతగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని, పిల్ల‌ల్ని అమితంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ ఇది. ఈ మంగ‌ళ‌వారం ముగింపు ద‌శ‌కు కీల‌క అడుగు ప‌డేలా వుంది.

హిమ సాక్షిగా ఒట్టు వేస్తున్నాను నీకు మంచే జ‌ర‌గాలంటూ డాక్ట‌ర్ బాబు దీప‌కు మాటిస్తాడు. అక్క‌డి నుంచిఏ దీప‌లో పాజిటీవ్ వైబ్స్ మొద‌ల‌వుతాయి. ఇంటికి వెళ్లిన దీపి హిమ‌తో మేడ‌పై ప‌డుకుని డాక్ట‌ర్ బాబు సంగుత‌ల్ని చెబుతూ అమితానందంలో నిద్రలోకి జారుకుంటుంది. డాక్ట‌ర్ బాబు కూడా శౌర్య‌తో క‌లిసి మేడ‌పైకి వెళ్లి అక్క‌డే వెన్నెల‌ని చూస్తూ డాబాపై ప‌డుకుంటారు.

ఇంత‌లో శౌర్య కాలుష్యం అంటే ఏంటి అని డాక్ట‌ర్ బాబుని అడుగుతుంది. కాలుష్యం అంటే ఆకాశానికి భూమికి మ‌ధ్య వుండేది అని చెబుతాడు. దీంతో వెంట‌నే శౌర్య అది పోతే అని అడుగుతుంది. అది పోతే ఆకాశం నిర్మ‌లంగా స్వ‌శ్చంగా వుంటుంది అని డాక్ట‌ర్‌బాబు (కార్తీక్‌) అంటాడు. ఆకాశానికిభూమికి మ‌ధ్య కాలుష్యం వున్న‌ట్టే నీకు అమ్మ‌కు మ‌ధ్య అలాంటిది ఏదో వుంది కాదా? నాన్నా అన‌గానే కార్తీక్ షాక్ అవుతాడు.. వెంట‌నే ఆలోచ‌న‌లో ప‌డిపోతాడు. శౌర్య మాట‌ల‌తో కార్తీక్‌లో మార్పు మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది తెలియాలంటే మంగ‌ళ‌వారం ఎసిసోడ్ చూడాల్సిందే.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.