English | Telugu

మోనితను చూసిన దీప... పోలీసులకు ఎలా పట్టిస్తుంది?

మోనిత మరణించలేదన్న నిజం దీపకు తెలిసింది. తెలియడం మాత్రమే కాదు... దీపను చంపడానికి మోనిత వేసిన ప్లాన్ బెడిసికొట్టడంతో పాటు దీపకు మోనిత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. అయితే, అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకుంటుంది. మోనిత బతికిఉందన్న నిజాన్ని మామగారు ఆనందరావు అండ్ ఫ్యామిలీకి, జైలులో ఉన్న భర్త కార్తీక్ కు చెబుతుంది. అయితే, నిజం తెలియడం వేరు. దాన్ని నిరూపించడం వేరు.

మోనిత మరణించలేదని, కార్తీక్ ను జైలుకు పంపడం కోసం నాటకం ఆడిందని పోలీసుల ముందు దీప ఎలా నిరూపిస్తుంది? మోనితను పట్టించడానికి అందివచ్చిన అవకాశాన్ని కార్తీక్-దీప దంపతులు గుర్తిస్తారా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది. మరి, ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...

ఒంటరిగా గుడికి వచ్చిన దీపను గన్‌తో షూట్ చేసే సమయంలో తుమ్ము రావడం, సరిగ్గా అదే సమయంలో అక్కడికి దుర్గ రావడంతో సోదమ్మ వేషంలో ఉన్న మోనిత తప్పించుకున్న సంగతి తెలిసిందే. అయితే, మోనితను దీప చూస్తుంది. జరిగినదాన్ని తలుచుకుంటూ మోనిత బాధపడుతుంది. తన చేతికి మట్టి అంటుకోకుండా దీప అడ్డు తొలగించి కార్తీక్ ను తనవాడిని చేసుకోవడం ఎలా? అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే... మరోవైపు తండ్రి ఎందుకు జైలుకు వెళ్ళాడో తెలుసుకోవాలని పిల్లలు దీపను ప్రశ్నిస్తారు. దాంతో వాళ్లపై దీప కోప్పడుతుంది.

కట్ చేస్తే... దీపను చంపాక‌ ఎక్కడో చేసిన పొరబాటు సాక్ష్యంగా మారితే కార్తీక్ జైలు నుండి బయటకు వచ్చినా, తాను జైలులోకి వెళ్లాల్సి వస్తుందన్న నిజాన్ని మోనిత గ్రహిస్తుంది. దాంతో ప్లాన్ బి అమలు చేయాలని అనుకుంటుంది. రత్నసీతకు ఫోన్ చేసి చెబుతుంది. 'రిస్క్ ఏమో మేడమ్' అని రత్నసీత ప్రశ్నిస్తే 'కార్తీక్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాన'ని అంటుంది.

జైలులో మోనిత ప్లాన్ ను రత్నసీత అమలు చేయడం మొదలు పెడుతుంది. 'డాక్టర్ సార్.. మీకు బయట టీ చెప్పి వెళ్తాను. మూగమ్మాయి వచ్చి మీ టీ ఇస్తుంది' అని వెళుతుంది. మూగమ్మాయి వేషంలో జైలులోకి మోనిత వస్తుంది. ఆ సమయంలో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. మోనితను చూశానని దీప చెబుతుంది. కార్తీక్ మాత్రం తనను విడిపించాలనే ధ్యాసలో అలా అంటున్నావని అంటాడు. 'లేదు డాక్టర్ బాబు. మోనిత రివాల్వర్ తో వచ్చింది. దాన్ని పట్టుకుని మిమ్మల్ని బయటకు తీసుకొస్తా' అంటుంది దీప.

అదే సమయంలో కార్తీక్ చేతిని తాకుతూ టీ అందించి మోనిత వెళుతుంది. ఈ సన్నివేశం చాలా ఉత్కంఠగా ఉంది. అక్కడ మోనిత స్పర్శను కార్తీక్ గమనిస్తాడు. దీపతో మాట్లాడుతూ ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోడు. 'ఆ స్పర్శ మోనితదే' అనుకుంటాడు. అయితే, మోనిత బయటకు వెళ్లే సమయంలో కాలికి ఏదో తగలడంతో 'హా' అంటుంది. మూగమ్మాయి ఎలా అరిచింది? అనేది కార్తీక్, దీప గమనిస్తే ఆమెను పట్టించవచ్చు. కళ్ళముందుకు వచ్చిన మోనితను పెట్టుకుంటారా? లేదా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.