Read more!

English | Telugu

దుగ్గిరాల ఫ్యామిలీ పార్టీకి కనకం కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 78 లో.. స్వప్నతో రాహుల్ ఫోన్ మాట్లాడుతుండగా కావ్య చూసేస్తుంది. దాంతో రాహుల్ వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఆపేసారేం మాట్లాడండి.. మా అక్కతోనే కదా.. నాకు తెలుసు.. మా అక్కని రౌడీల నుండి కాపాడినందుకు థాంక్స్.. ఏ రోజైనా నిజం తెలుస్తుంది. అప్పుడు నడిరోడ్డు మీదకే రావాల్సి వస్తుందని రాహుల్ తో కావ్య అంటుంది. నా దారికి ఎదురు రావొద్దు.. నిజానిజాలు తెలుసుకోకుండా సాక్ష్యాలు లేకుండా మాట్లాడొద్దు.. ఆల్ ది బెస్ట్ అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత సీతారామయ్య-ఇందిరాదేవీల వివాహ దినోత్సవం గురించి దుగ్గిరాల కుటుంబంలోని వాళ్ళంతా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అయితే అందులో రాజ్-కావ్యలని చూసి ఇంద్రాణి కుళ్ళుకుంటుంది. ఈ శుభ సందర్భంలో మనం కావ్య వాళ్ళ ఫ్యామిలీని పిలుద్దాం.‌. కావ్య సంతోషిస్తుందని ఇందిరాదేవీతో సీతారామయ్య అంటాడు. దాంతో ఇందిరాదేవి కనకంకి కాల్ చేసి పెళ్ళిరోజుకి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత కనకం-కృష్ణమూర్తి అందరూ సంతోషిస్తారు. ఈ విషయాన్ని రాహుల్ కి కాల్ చేసి.. ఈవినింగ్ పార్టీకి నేను వస్తున్నానని  స్వప్న  చెప్తుంది. అదే సమయంలో రాహుల్ ఫోన్ లో మాట్లాడటం చూసిన ఇంద్రాణి.. ఏంటి రాహుల్ ఇలా అమ్మాయితో సోది కబుర్లు చెప్పే బదులు నేను చెప్పిన పని చేయొచ్చు కదా.. నీకొక సంబంధం చూసాను.. అమ్మాయి కోటీశ్వరురాలు.. తనని నిన్ను కూడా తనే చూసుకుంటుందంట.. ఈవినింగ్ పార్టీలో ఇదే విషయం చెప్తానని ఇంద్రాణి అనేసి వెళ్తుంది. ఇలా ఇంద్రాణి మాట్లాడిందంతా విన్న స్వప్న.. ఈవినింగ్ పార్టీకి తను కచ్చితంగా వెళ్ళి.. రాహుల్ తనని పెళ్ళి మండపం నుండి తీసుకెళ్ళాడని చెప్దామని అనుకుంటుంది. కాసేపటికి కనకం, కృష్ణమూర్తి, అప్పు అందరూ దుగ్గిరాల కుటుంబంలోని పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతారు.  అదే టైంలో స్వప్న రెడీ అయి వస్తుంది.

కృష్ణమూర్తి, కనకం వాళ్ళు స్వప్నని తిడతారు. స్వప్నకి రావొద్దని చెప్పి వాళ్ళంతా  పార్టీకి వెళతారు. కనకం, కృష్ణమూర్తి, అప్పు దుగ్గిరాల ఇంటిముందు ఆటోలో దిగడం చూసిన రుద్రాణి.. వదిన నీ బ్రాడ్ మైండ్ కి నాకు జోహార్లు.. ఈ ఫంక్షన్ కి నీ శత్రువులను కూడా పిలిచావా అని అపర్ణతో అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ రుద్రాణి అని అపర్ణ అనగా.. అక్కడ చూడు నీ వియ్యాలవారు వచ్చారని చెప్పగా.. కనకం-కృష్ణమూర్తిలను చూసిన అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.