Read more!

English | Telugu

రాకింగ్ రాకేష్ కి షాకిచ్చిన తన భార్య!

 

వేసవికాలం వచ్చేసింది.. సమ్మర్ లో కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్, పెరుగన్నం, నిమ్మకాయ షర్బత్ అంటు జనాలంతా నిత్యం తమను తాము కాపాడుకుంటున్నారు. ఆయితే జబర్దస్త్ కామెడీయన్ రాకింగ్ రాకేష్ కి సమ్మర్ వడదెబ్బ కంటే వాళ్ళావిడ ఇచ్చిన షాకే ఎక్కువ తగిలింది.

జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో తెలంగాణ యాస‌లో  ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది. అలా తీన్మార్ వార్త‌లు కార్య‌క్ర‌మంలో సుజాత‌గా పరిచయమయ్యింది. ఆమె ఆ తరువాత జోర్దార్‌ వార్తలతో 'జోర్దార్‌ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. సుజాత జబర్దస్త్  కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకేష్ పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ కలిసి విదేశాలకు వెళ్ళారు. మొదటగా అమెరికాకి వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ హోమ్‌ టూర్ పేరిట వ్లాగ్ , 'లండన్ ఫ్లైట్ మిస్ అయింది మా పరిస్థితి ఏంటి' వ్లాగ్, 'టైటానిక్ తయారు చేసింది ఇక్కడే కానీ మునగడానికి కారణం ఏంటి' వ్లాగ్ లు చేయగా వాటికి మంచి వ్యూస్ వచ్చాయి.

జోర్దార్ సుజాత, రాకింగ్ రాకేష్ కలిసి యూట్యూబ్ లో చేసే వ్లాగ్స్  తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు తాజాగా ఓ మినీ వ్లాగ్ చేయగా అది నెట్టింట వైరల్ గా మారింది. సమ్మర్ కదా అలా దుబాయ్ వెళ్దామా అండి అని రాకేష్ ని సుజాత అడుగగా.. పక్కనే కేబుల్ బ్రిడ్జ్ ఉంది అక్కడికెళ్దామని అంటాడు. ప్యారిస్ వెళ్దామా అంటే పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్దామని అంటాడు. అలాగే ఎక్కడికెళ్దామన్నా సిటీ దాటి వెళ్ళొద్దన్నట్టుగా భార్య అడిగిన వాటికి నో చెప్తూ ఉంటాడు రాకేష్. ఇక ఎక్కడికి వెళ్దామని అడిగినా భర్త నో చెప్పడంతో విసుగుచెందుతుంది సుజాత. తలనొప్పిగా ఉంది స్ట్రాంగ్ కాఫీ  తీసుకురావా అని సుజాతని రాకేష్ అడుగగా.. పక్కనే కాఫీషాప్ ఉంది కదా అక్కడికెళ్ళి తాగండి అని సుజాత అనగానే రాకేష్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. అలాగే ఉంటుంది మరి. భార్య అడిగింది ఇవ్వకపోతే ప్రతీ భర్తకి ఇదే జరుగుతుందన్నట్టుగా ఈ వ్లాగ్ లో సుజాత, రాకేష్ లు తెలియజేసారు. మరి మీ ఇంట్లో ఇలా ఎప్పుడైన జరిగిందా కామెంట్ చేయండి.