Read more!

English | Telugu

గుప్పెడంత మనసు అనుపమ అలియాస్ చంద్ర లక్ష్మణ్ గురించి తెలుసా!

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ జాబితాలో టాప్-5 లో ఉన్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువే. అయితే గత మూడు నెలలుగా ఈ సీరియల్ లో రిషి కనపడకపోవడంతో టీఆర్పీలో కాస్త వెనకవడింది.

అయితే ఈ సీరియల్ రిషి పాత్ర కనపడకుండా ఉన్న నాటినుండి మను, అనుపమ పాత్రలని తీసుకొచ్చారు మేకర్స్. దీంతో ఈ కథ ప్రస్తుతం అనుపమ , మను ల చుట్టూనే తిరుగుతుంది. జగతి చనిపోయాక ఆమె ఫ్రెండ్ స్థానంలో అనుపమ వచ్చేసింది. ఇక వసుధారని రాజీవ్ ఇబ్బంది పెడుతుంటే మను వచ్చి కాపాడాడు. ఇలా ఈ రెండు కొత్త క్యారెక్టర్లు వచ్చిన నుండి కథ అలా ముందుకు సాగుతోంది. అయితే మనుకి తల్లిగా అనుపమ ఎంత చక్కగా చేస్తుందో అందరికి తెలిసిందే. మరి బయట తనెవరు? ఎక్కడుంటుంది? పెళ్ళి అయిందా లేదా తెలుసుకుందాం. అనుపమ బయట అసలు పేరు చంద్ర లక్ష్మణ్.. తను 2002 లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తమిళం, మళయాలంలో  కలిపి పది సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ' గుప్పెడంత మనసు సీరియల్ ' కన్నా ముందు మమతల కోవెల, సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించింది. చెన్నైలో హోటల్ మేనేజ్ మెంట్ చదువుతున్న సమయంలో చంద్ర లక్ష్మణ్ కి సినిమాల్లో అవకాశం వచ్చింది. 2021లో లక్ష్మణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న చంద్రకి.. ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. 

చంద్ర లక్ష్మణ్ తన కొడుకు, భర్తలతో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది ఈ అనుపమ. మరి గుప్పెడంత మనసు సీరియల్ లో అనుపమగా చేస్తున్న ఈ చంద్ర లక్షణ్ మీకు తెలుసా.‌ మరి ఈ సీరియల్ లో తన నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.