English | Telugu

మా ఇంటి రెంట్ కూడా మా అక్కే కట్టేది.. అక్క నాకు అమ్మ ఐపోయింది!

బిబి జోడి సీజన్ 2 కి సంబంధించి లేటెస్ట్ గా మరో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆర్జే చైతు - కీర్తి భట్, సాయి శ్రీనివాస్ - నయని పావని జోడీస్ స్టేజి మీదకు వచ్చాయి. "సదా మేడం మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లు బ్లూ" అంటూ సదాతో ఫన్ చేసాడు ఆర్జే చైతు. "మార్క్స్ లో ఏమీ తేడా రాదు" అంటూ సదా కౌంటర్ వేసింది. "శ్రీదేవి మేడం బ్లడ్ మేడం రెడ్డు" అనేసరికి "అయ్యో" అనేసింది. "మరి సర్ " అంటూ ప్రదీప్ శేఖర్ మాస్టర్ వైపు చూపించేసరికి "వద్దు బాబు వద్దు" అనేశాడు.

తర్వాత నయనిపావని - సాయి శ్రీనివాస్ కలిసి కాండిల్ థీమ్ తో చేసిన సాంగ్ కి జడ్జ్ సదా ఫిదా ఐపోయి "నాకు రెండు కాండిల్స్ లా అనిపించలేదు.. ఒక కాండిల్ పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది" అంటూ చెప్పింది.

తర్వాత హోస్ట్ ప్రదీప్ సాయి శ్రీనివాస్ ని ఒక ప్రశ్న అడిగాడు. "హాయ్ నీ లైఫ్ లో వెలుగునిచ్చి నిన్ను ఇలా సపోర్ట్ చేసే పర్సన్ ఎవరు" అని అడిగాడు. " మా అక్క మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇంట్లో నేనెప్పుడూ డిపెండెంట్ నే. నిజానికి మా ఇంటి రెంట్ కూడా మా అక్కే కట్టేది. మా అక్క నాకు ఒకేసారి మదర్ ఐపోయింది. ఎనర్జిటిక్ గా కనిపించాలన్న, బాగా కనిపించాలి అన్నా బాగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. చాలామందికి తెలీదు. సో ఈ ప్రాసెస్ లో ఏ ఒక్క క్వశ్చన్ అడక్కుండా చూసుకునేది. నా లాంటి అబ్బాయిలకు వెనకాల ఇంత స్ట్రాంగ్ గా ఉండేది ఇలాంటి ఆడవాళ్లే..వి లవ్ యు" అంటూ సడెన్ సర్ప్రైజ్ గా స్టేజి మీదకు వచ్చిన వాళ్ళ అక్కను చూసి షాకయ్యాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.