English | Telugu

డాక్ట‌ర్లు ఎక్కువ రోజులు బ‌త‌క‌డ‌ని చెప్పినా నన్ను పెళ్లిచేసుకుంది!

'జబర్దస్త్' షోలో కమెడియన్స్ ఎంతగా ఎంటర్టైన్ చేస్తారో తెలిసిందే. అయితే వారి జీవితాల్లో మాత్రం చెప్పుకోలేనన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కో ఆర్టిస్ట్ వెనుక విషాద గాధ ఉంది. అవినాష్, అప్పారావు, నరేష్ ఇలా చాలా మంది వ్యక్తిగతంగా చాలా కష్టాలు పడుతున్నారు. 'జబర్దస్త్' స్టేజ్ మీద లేడీ గెటప్పులు వేసే నటుల పరిస్థితి గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా.. 'జబర్దస్త్' షో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. ప్రసాద్‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ మధ్య కొన్ని నెలలు 'జబర్దస్త్' షోకి దూరంగా ఉన్నారు.

అయితే ప్రసాద్‌ను కాపాడడానికి మల్లెమాల కానీ, 'జబర్దస్త్' కానీ ముందుకు రాలేదనీ, ఈ విషయంలో నాగబాబు బాగా హర్ట్ అయ్యారనీ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. 'జబర్దస్త్' నుండి బయటకు వెళ్లే ముందు కూడా ఈ విషయాలన్నీ గుర్తుచేసి మల్లెమాల టీమ్‌పై నాగ‌బాబు కామెంట్స్ చేశారు. ప్రసాద్‌కి అండగా ఆయ‌న‌ నిలబడ్డారు. 'జబర్దస్త్' ఆర్టిస్ట్ ల సహాయ సహకారాలతో ప్రసాద్ ఆపరేషన్‌కి కావాల్సిన డబ్బు మొత్తం నాగబాబు సేకరించారట. ఇప్పటికీ ఆ డబ్బు ఆయన దగ్గరే ఉందని.. ప్రసాద్ ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటారో అప్పుడు ఆ డబ్బు ఇస్తానని నాగబాబు చెప్పారట. ఇప్పుడే ఇచ్చేస్తే వేరే అవసరాల కోసం వాడేస్తారేమోనని ఆ డబ్బుని నాగబాబు తన వద్దే పెట్టుకున్నారని కొందరు ఆర్టిస్ట్ లు చెబుతుంటారు.

తాజాగా తన భార్యతో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాడు ప్రసాద్. ఇందులో తమ ప్రేమ, ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పి అందరినీ ఏడిపించేశాడు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసిందని.. డాక్టర్లు ఈ అబ్బాయి ఎక్కువ రోజులు ఉండరు.. రిస్క్ ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని తన భార్యకి సలహాలు ఇచ్చారని.. కానీ ఆమె మాత్రం ఏడాది బతికినా, రెండేళ్లు బతికినా ఆయనతోనే ఉంటానని చెప్పి పెళ్లికి సిద్ధమైందని గుర్తు చేసుకున్నాడు ప్రసాద్. ఇప్పటికీ ప్రసాద్‌కి కిడ్నీ సమస్య అలానే ఉందని.. కొడుకు కాస్త ఎదిగిన తరువాత అత‌డి భార్యే ప్రసాద్‌కి కిడ్నీ ఇవ్వబోతుందంటూ మరో కమెడియన్ రామ్ ప్రసాద్‌ చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది. భర్త కోసం కిడ్నీ దానం చేయడానికి రెడీ అయిన ప్ర‌సాద్ భార్య‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.