English | Telugu

ఇంటి క‌ష్టాల్లో జ‌బ‌ర్ద‌స్త్ వినోద్.. పోలీసుల‌కు కంప్ల‌యింట్‌!

తెలుగు కామెడీ షోల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా పాపుల‌ర్ అయ్యాడు వినోద్ అలియాస్ వినోదిని. అవును. చ‌మ్మ‌క్ చంద్ర జోడీగా లేడీ గెట‌ప్పుల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన వినోద్ త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఈస్ట్‌జోన్ డీసీపీ ర‌మేశ్‌రెడ్డికి విన‌తిప‌త్రం అందించాడు. కాచిగూడ‌లో తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని అమ్ముతాన‌ని 2019లో ఓన‌ర్ బాలాజీ రూ. 40 ల‌క్ష‌ల‌కు అగ్రిమెంట్ చేసుకొని, సంవ‌త్స‌రం క్రితం రూ. 13.40 ల‌క్ష‌లు అడ్వాన్స్ కూడా తీసుకున్నార‌ని ఆ కంప్ల‌యింట్‌లో వినోద్ తెలియ‌జేశాడు.

"అయితే ఇప్పుడు రూ. 40 ల‌క్ష‌ల కంటే ఎక్కువ డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా, అలా ఇవ్వ‌క‌పోతే అడ్వాన్స్ డ‌బ్బులు కూడా ఇవ్వ‌న‌ని బెద‌రిస్తున్నారు." అని అందులో పేర్కొన్నాడు. ఇదివ‌ర‌లో ఓసారి ఓన‌ర్ త‌న‌పై దాడి కూడా చేశార‌నీ, దాంతో తాను కాచిగూడ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాన‌నీ తెలిపాడు. "ఇప్ప‌టివ‌ర‌కూ కాచిగూడ పోలీసులు నా కంప్ల‌యింట్‌పై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. ఆయ‌న వ‌ల్ల నాకు ప్రాణ‌హాని కూడా ఉంది. ద‌య‌చేసి నాకు న్యాయం చేయండి." అని రిక్వెస్ట్ చేశాడు వినోద్‌.

అప్ప‌ట్లో వినోద్‌పై జ‌రిగిన భౌతిక దాడిలో అత‌ని కంటికి గాయ‌మైంది. దీని వ‌ల్ల కొంత‌కాలం జ‌బ‌ర్ద‌స్త్ షోకు కూడా అత‌ను దూర‌మ‌య్యాడు. ఏదేమైనా ఒక పాపులర్ టీవీ క‌మెడియ‌న్‌కు ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ‌డం విచార‌కరం.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.