Read more!

English | Telugu

’అందం ఐసుగడ్డయితే‘ అంటూ పేరడీ పాడుతున్న ఆది

బుల్లితెర మీద హైపర్ ఆది చేసే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. కొన్ని పంచులు పేలతాయి కొన్ని మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఐనాసరే తాను నమ్మిన కామెడీనే ఫాలో ఐపొతూ ఉంటాడు. హైపర్ ఆది ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ 14 షోస్ లో  పాల్గొంటున్నాడు.  తాజాగా ఢీ 14 షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆగష్టు 24న ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకుంటున్నారు. శ్రద్దాదాస్, పూర్ణ, జానీ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు.  

ఇంకా ఈ లేటెస్ట్ ప్రోమోలో  శ్రద్దా, హైపర్ ఆదికి సంబంధించిన  రొమాంటిక్ ట్రాక్ సూపర్ హైలైట్ గా నిలిచింది. శ్రద్దా, ఆది మధ్య చాలా కాలంగా  రొమాంటిక్ డ్రామా నడుస్తోంది. శ్రద్దా అందాలకు ఫిదా ఐపోతుంటాడు ఆది. ముద్దు ముద్దు అంటూ వెంట పడుతూ ఆమెని అదే పనిగా పొగిడేస్తూ ఉంటాడు. శ్రద్ధా కూడా తానేమీ తక్కువ కాదన్నట్టు ఆ  పొగడ్తలకు ఫిదా ఐపొతూ ఉంటుంది ఈ  లేటెస్ట్ ప్రోమోలో శ్రద్దా ఆదికి ముద్దు ఆఫర్ ఒకటి ఇస్తుంది. మంచు గడ్డపై కాసేపు నిలబడితే ముద్దిస్తానని చెప్తుంది. దీంతో  ఆది గాల్లో తేలిపోతాడు.

పైకి వెళ్లేముందు ఒక హాఫ్ కిస్ ఇస్తే మంచి ఎనర్జీ వస్తుంది అని రిక్వెస్ట్ చేసేసరికి ప్రదీప్ అదేం కుదరదు అన్నట్టుగా చెయ్యి ఊపి నో చెప్పేస్తాడు. ఇక తప్పదన్నట్టు ఐస్ గడ్డ మీద ఆది నిలబడి "అందం ఐసుగడ్డయితే" అంటూ " నీ కాళ్ళను పట్టుకు " అనే పాటలు పాడి మరీ మెప్పిస్తాడు. ఇక హైపర్ ఆది ఆ ఐస్ గడ్డపై ఎంత సేపు నిల్చున్నాడు, శ్రద్ధా తాను ప్రామిస్ చేసినట్టే ముద్దిచ్చిందా అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.