English | Telugu

నన్ను కొట్టొచ్చు అంటూ పర్మిషన్ ఇచ్చిన నాగబాబు

జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఈ వారం ఆది పంచులు స్కిట్ మాములుగా లేదు. అందులోనూ ప్రత్యేకంగా జడ్జ్ ఇంద్రజ మీదనే పెద్ద డైలాగ్ వేసాడు ఆది. ఇక నాగబాబు మీద డైలాగులా వరద కురిపించాడు. "రాగానే ఇద్దరి మధ్యలో కూర్చున్నారు. మీ కళ్ళకు ఎలా ఉందొ కానీ నా కళ్ళతో చూడండి మామ. ఇంద్రజ పక్కన కూర్చున్న ఇంద్రసేనారెడ్డిలా ఉన్నారు..ఖుష్భూ గారి పక్కన కూర్చున్న ఖైదీలా ఉన్నారు. మొత్తంగా మగమహారాజులా ఉన్నారు. ఆయన పట్టుకోకపోవడంవల్లనే చాలామందిమి పట్టు తప్పాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం దారిలోకి వస్తున్నాం. బేసిక్ గా నాగబాబు గారి పక్కన ఎవరు కూర్చున్నా భుజాల మీద కొట్టి నవ్వడం అలవాటు..ఒకవేళ మీకు కూడా ఆ అలవాటుఉంటే " అన్నాడు ఆది. దానికి నాగబాబు "కొట్టొచ్చు ఎం పర్లేదు" అన్నారు. "కొంచెం చిన్నగా కొట్టండి..ఇప్పుడు ఓన్లీ కొట్టడానికి కాదు పది మందికి పెట్టడానికి కూడా ఆ చేతులు కావాలి. ఆ చివర ఖుష్బూ గారు ఆల్రెడీ పొలిటికల్. మీరు పొలిటికల్ .

ఈ ఎపిసోడ్ అయ్యేలోపు ఇంద్రజ గారు మీరు కూడా మాట్లాడుకుని పాలిటిక్స్ లోకి వెళ్లిపోండి. " అన్నాడు ఆది ఇంద్రజాతో. ఆవిడ బాబోయ్ నాకొద్దు అన్నట్టుగా పెట్టారు ఫేస్. "ఆమ్మో పాలిటిక్స్ లోకి వద్దులే. మీరు మాములుగా మాట్లాడితేనే స్పీచులు ఇచ్చినట్టు ఉంటుంది. పాలిటిక్స్ అంటే మొత్తం స్పీచులే ఉంటాయి మాటలు ఉండవు. ఇంద్రజగారు జడ్జ్మెంట్ ఇచ్చేలోపు మీరు జనసేన మీటింగ్ కి కూడా వెళ్లిరావచ్చు. " అంటూ చెప్పుకొచ్చాడు ఆది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.