Read more!

English | Telugu

సింగర్ లాస్యప్రియకు మంత్రి హరీశ్ రావు ప్రోత్సాహం!

ఆహా వేదికగా ఇండియన్ ఐడల్ సీజన్- 2 సింగింగ్ కాంపిటీషన్ గ్రాండ్ గా మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ షో ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంది. దీనికి జడ్జిలుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్స్ కార్తీక్, గీతా మాధురిలు వ్యవహరిస్తున్నారు. హేమచంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు.

ఇండియన్ ఐడల్ ఎప్పటికప్పుడు కొత్త ట్యాలెంట్ ని పరిచయం చేస్తూ సరికొత్తగా మన ముందుకు వస్తోంది. అయితే తాజాగా విడుదలైన ఈ షో ప్రోమోలో.. సిద్దిపేటకి చెందిన లాస్యప్రియ తన అద్భుతమైన పాటతో ఆకట్టుకుంది. ప్రతి వారం జడ్జెస్ నుండి కాంప్లిమెంట్ తీసుకుంటూ.. లాస్యప్రియ తనదైన శైలిలో అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. షో ప్రారంభ సమయంలో హీరో బాలకృష్ణ ఆమెను స్టేజి మీదకి ఆహ్వానిస్తూ.. సిద్దిపేట పోరి అంటూ ఆహ్వానించి తనతో కలిసి చిందులేశాడు. మొదటి ఫర్మామెన్స్ నుండి ఇప్పటివరకు వినసొంపైన వాయిస్ తో మ్యాజిక్ చేస్తోంది లాస్య ప్రియ.

అయితే సిద్దిపేట మంత్రి హరీష్ రావు లాస్య ప్రియ గురించి తన ట్విట్టర్ లో ట్విట్ చేసాడు. ఆహా లో జరుగుతున్న ఇండియన్ ఐడల్ సీజన్- 2 సింగింగ్ కాంపిటేషన్లో అద్భుతంగా పాటలు పాడుతూ అందరిని మెప్పిస్తున్న సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్యప్రియకు హృదయపూర్వక అభినందనలు. నీ సంగీత  ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీశ్ రావు ట్వీట్ చేశారు. దానికి లాస్య ప్రియా హ్యాపీగా ఫీల్ అవుతూ.. ఆ ట్వీట్ ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఇలా హరీశ్ రావు గారు నా పాటలని గుర్తించి నన్ను ప్రోత్సాహించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది లాస్యప్రియ. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.