English | Telugu

హరితేజ నిజస్వరూపాన్ని బయటపెట్టిన యాంకర్!

 

బిగ్ బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేట్ అయ్యింది. ఇక బయటకొచ్చే ముందు బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసింది హరితేజ. సీజన్-8 లో ఇంత త్వరగా రావడానికి కారణం ఏంటిని యాంకర్ అడుగుగా.. సీజన్ 1తో సీజన్ 8 హరితేజను పోల్చీ పోల్చీ ఇలా అయ్యిందని హరితేజ చెప్పింది.

హరితేజ గురించి బయట ఆడియన్స్ ఏ విధంగా అనుకుంటున్నారో.. ఆ కామెంట్స్‌ని హరితేజకి చూపించాడు యాంకర్. ఇంట్లో డస్ట్ బిన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో బిగ్ బాస్ హౌస్‌లో హరితేజ వల్ల కూడా అంతే యూజ్ ఉంటుందంటు ఓ నెటిజన్ ఫైర్ అయిన ట్వీట్‌ని చూపించాడు. ఏది పడితే అది మాట్లాడటం వాళ్ల హక్కుగా భావించినప్పుడు.. వాళ్లని మనం కన్వెన్స్ చేయడం కష్టమని చాలా హరితేజ కవరింగ్ మే దడ్ దడ్ చేసింది. మరో ట్వీట్‌లో బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ కంటెస్టెంట్ హరితేజ అని మరో నెటిజన్ ఫైర్ అయిన ట్వీట్‌ని యాంకర్ చూపించగా. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి.. ఇన్నేళ్లు ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ.. నెల రోజుల్లో చెడ్డది ఎలా అయిపోతుందని  హరితేజ కవర్ చేసుకుంది. 


కామెడీతో అలరిస్తున్న రోహిణి, అవినాష్‌లపై పడి ఏడ్వడంతోనే ఈ జర్నీ అయిపోయింది. నవ్వు అనే అద్భుతమైన మంత్రంతో లాక్కొచ్చేస్తున్నాడు అని అవినాష్ గురించి చెప్పింది హరితేజ. ఇక హౌస్‌లో ఉన్నప్పుడు.. విష్ణు ప్రియపై ప్రేమ కురిపించిన హరితేజ.. బయటకు వచ్చిన తరువాత.. హౌస్‌లో కళామ్మతల్లి ముద్దు బిడ్డ పృథ్వీపై చేస్తున్న పత్తేపారం గురించి మాట్లాడింది. ఇక ఈ ఫ్లిప్పింగ్ స్టార్ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. బాగా పర్ఫామెన్స్ ఇచ్చే నబీల్ , ప్రేరణ, అవినాష్, రోహిణి, తేజలని బ్యాక్ బిచ్చింగ్ చేసి వరెస్ట్ ప్లేయర్ అనిపించుకుందని హరితేజని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.