English | Telugu

Nominations promo :  నామినేషన్లో తడపడ్డ నిఖిల్.. టేస్టీ తేజ వ్యాలిడ్ పాయింట్!

 

బిగ్ బాస్ సీజన్-8 లో పది వారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేషన్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక పదకొండవ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చెప్తూ సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియ ప్రోమో రానే వచ్చింది. ఇందులో రెండు నామినేషన్లు హైలైట్ గా నిలిచాయి.

నామినేషన్ల ప్రక్రియ ఏంటంటే.. హౌస్ మేట్స్ పెయింటింగ్స్ ఉంటాయి. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి పెయింటింగ్‌పై రంగు పూయాలి. ఇక తేజను నిఖిల్ నామినేట్ చేస్తూ తన రీజన్ చెప్పాడు. ఒక చిన్న డిస్ రెస్పెక్ట్ చేసినందుకే తేజ నన్ను నామినేట్ చేశాడు.. కానీ తను బిగ్‌బాస్ రూల్‌నే బ్రేక్ చేశాడు అంటూ నిఖిల్ చెప్పాడు. దీనికి డిఫెండ్ చేసుకుంటూ అది ఇంట్లో నుంచి పరిగెత్తి బయటికెళ్లిపోయేంత తప్పు కాదనేది నా ఉద్దేశం.. సరే నాది తప్పు బ్రో మరి తర్వాత జరిగింది తప్పా కాదా అంటూ యష్మీ ఇష్యూను లేవనెత్తాడు తేజ. దీనికి ఏం చెప్పాలో తెలీక నువ్వు చేసిన తర్వాత ఆమె చేసిందా.. ఆమెను అడుగు అయితే అంటూ తప్పించుకునేందుకు నిఖిల్ ట్రై చేశాడు. కానీ తేజ వదలకుండా భయం నీకు మాట్లాడటానికి, అది తప్పా కాదా చెప్పు అంటూ తేజ రెచ్చగొట్టాడు. దీనికి నేను చెప్పా అంటూ నిఖిల్ అడ్డంగా వాదించాడు. భయమా మరెందుకు చెప్పవంటూ తేజ అంటే నీదే తప్పు అంటూ  నిఖిల్ అరిచాడు.

వీరిద్దరితో పాటు మరో నామినేషన్ హైలైట్ అయ్యింది. గౌతమ్‌ను నామినేట్ చేసింది ప్రేరణ. మొత్తం బయటి ప్రపంచాన్నే మైండ్‌లో పెట్టుకొని గౌతమ్ ఆడినట్లుంది.. తనకి క్లారిటీ అనేది ఎక్కువ లేదంటూ ప్రేరణ చెప్పింది. దీనికి ఎప్పటిలానే గౌతమ్ రెచ్చిపోయాడు. ఒక మనిషికి బ్రాండింగ్ వేయడమనేది డిస్ రెస్పెక్ట్.. అవమానానికి ఆచరించకపోవడానికి చాలా తేడా ఉంది.. ప్రతి దానికి అరె నువ్వు తప్పు చేసినవ్ నీ వల్లే ఓడిపోయినవ్.. నీ వల్లే ఓడిపోయినవ్.. అని గుచ్చి గుచ్చి చెప్పడం టీమ్ మెట్ లక్షణం కాదు.. మెగా చీఫ్ లక్షణం కాదంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.