Read more!

English | Telugu

 ఒక ముద్దు కావాలని అడిగిన హరి...

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం దుమ్ము రేపేదిలా కనిపిస్తోంది ప్రోమో చూస్తుంటే. దసరా ఫీవర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జి ఇంద్రజ, ఢీ షోలో కొరియోగ్రాఫర్ గ్రీష్మ పసుపురంగు పెళ్లి బట్టల్లో ఒక ఊపు ఊపేసారు. ఇప్పుడు శ్రీముఖి వంతు వచ్చేసింది. ఈ వారం దసరా మూవీలో వెన్నెల గెటప్ లో వచ్చి స్టేజి మీద ధూందాం చేసేసింది తన డాన్స్ తో.."ఈ రోజు మా సీరియల్ పురంలో జరుపుకుంటున్నాం దసరా పండగా" అని మంచి జోష్ తో చెప్పేసింది. ఎక్స్ప్రెస్ హరి శ్రీముఖికి లవర్ గెటప్ లో కనిపించాడు. " ఎన్నిరోజులయ్యిందో నీకు లవర్ గా యాక్ట్ చేసి..ఒక ముద్దివ్వా..లవర్ కదా" అన్నాడు. "అన్నీ పెళ్లయ్యాకే.ఛీపో  " అని సిగ్గుపడుతూ చెప్పింది శ్రీముఖి. "పెళ్లయ్యాక మీ ఆయన ఒప్పుకుంటాడా చెప్పు" అనేసరికి షాకయ్యింది శ్రీముఖి.

తర్వాత ఫైమా వచ్చి "కామెడీ గొప్పదా..రొమాన్స్ గొప్పదా" అనేసరికి "కామెడీ గొప్పది" అన్నాడు అవినాష్.."మరి అందరితో రొమాన్స్ చేస్తూ తిరుగుతావేంటి" అని వీపు విమానం మోతమోగించింది. ఇందులో "క్లాస్ వర్సెస్ మాస్" థీమ్ తో ఈ వారం షో జరగబోతోంది. క్లాస్ గెటప్స్ లో నిరుపమ్, రవికృష్ణ, మానస్ వచ్చారు. మాస్ టీమ్ లో అంబటి అర్జున్, సిద్దార్థ్ వర్మ, దీపికా, వాసంతి కృష్ణన్ వచ్చారు.  "నిరుపమ్ బావా" అంటూ శ్రీముఖి సరదాగా ఆటపట్టించేసరికి ఆయన సిగ్గుపడిపోతూ " కర్రిగా ఉంటుంది కాకి, చెర్రీలా ఉంటుంది శ్రీముఖి" అని చెప్పాడు. ఇక ఈ రెండు టీమ్స్ మంచి గేమ్స్ ఆడించింది శ్రీముఖి. మరి ఏమేం గేమ్స్ ఆడించింది...వాళ్ళు ఎలా ఆడారో తెలియాలంటే సండే ఫండే వరకు వెయిట్ చేయాల్సిందే.