Read more!

English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ లో మరో ట్విస్ట్.. వసుధారకి తెలిసిన నిజం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -761లో.. జగతి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. ఏదో పిన్ని కొడుకు అని అలోచించి ఏం చెయ్యలేదని శైలేంద్ర అంటుండగా.. అటు వైపుగా వెళ్తున్న వసుధార శైలేంద్ర మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా.. రిషి జోలికి రావద్దని జగతి అంటుంది. నేను అదే చెప్తున్నాను.. సైలెంట్ గా రిషి, వసుధారల ఎంగేజ్ మెంట్ జరిపించి ఎక్కడికైనా పంపించండి. ఆ తర్వాత ఎండీ సీట్ లో నేను కూర్చోవాలి.. ఆ  టేబుల్ మీద శైలేంద్ర భూషణ్ అని నేమ్ బోర్డు ఉండాలని జగతితో శైలేంద్ర అంటాడు. ఫ్రీగా చెప్తున్నాను పిన్ని.. DBST కాలేజీ నాకు ఇచ్చి, నీ కొడుకు ప్రాణాలు నువ్వు కాపాడుకోమని శైలేంద్ర అంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ వసుధార వినేస్తుంది‌.

ఆ తర్వాత రాత్రి వసుధార ఒంటరిగా కూర్చొని శైలేంద్ర మాటలు గుర్తుచేసుకుంటుంది. మరొకవైపు రిషి నా వెనకాల ఏదో జరుగుతుందని అనుకుని.. వసుధార దగ్గరికి వస్తాడు. నాకు భయంగా ఉంది ఇప్పటికైనా పోలీస్ కంప్లేంట్ ఇద్దామని వసుధార అనగానే.. అవన్నీ డాడ్ చూసుకుంటాడు.. నువ్వేం బయపడకని రిషి అంటాడు. సర్ మీరేం అనుకోవద్దు.. ఈ ఎంగేజ్మెంట్ ని ఆపేద్దామని వసుధార అనగానే.. ఏంటి వసుధార.. ఏం మాట్లాడుతున్నావని ఆశ్చర్యంగా అడుగుతాడు రిషి. మా ఇంట్లో వాళ్ళు రాలేని పరిస్థితి.. సర్ నన్ను అర్ధం చేసుకోండని వసుధార అనగానే.. రిషి కోపంగా వెళ్ళిపోతాడు. మరుసటిరోజు ఉదయం ఇంట్లో అందరి ముందు వసుధారకి ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని రిషి చెప్తాడు.. ఏమైంది ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పు ఇన్ని రోజులు పెళ్లి చేసుకుంటా అని వెయిట్ చేసి ఇలా మాట్లాడుతున్నావేంటి వసుధార అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత కాసేపటికి.. మీ వాళ్ళతో నేను మాట్లాడి రమ్మంటానని ఫణింద్ర చక్రపాణికి కాల్ చేసి ఎంగేజ్ మెంట్ చేస్తున్నాం.. మీరు రావాలని ఫణింద్ర చెప్తాడు. రిషి ఫోన్ తీసుకొని ఎంగేజ్ మెంట్ కి రండి అని చెప్తాడు. అటువైపు నుండి సరే అని చక్రపాణి అంటాడు. ఇప్పుడు నీకు ఒకే  కదా వసుధార అని రిషి అడుగుతాడు. నాకు కొంచెం టైం కావాలని వసుధార అనగానే.. రిషి గట్టిగా అరుస్తూ నాకు టైమ్ లేదని అంటాడు. ఖచ్చితంగా ఎంగేజ్ మెంట్ జరగాలి.. అనుకున్న విధంగా ఎంగేజ్ మెంట్ జరగకపోతే ఈ టైం మళ్ళీ రాదని రిషి చెప్పేసి  అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత జగతి దగ్గరికి వసుధార వస్తుంది.. ఏమైంది వసుధార ఎంగేజ్ మెంట్ ఎందుకు వద్దంటున్నావని అడుగుతుంది. నాకు నిజం తెలిసింది మేడం.. శైలేంద్ర మీతో మాట్లాడింది మొత్తం విన్నానని వసుధార అంటుంది. నువ్వు ఫస్ట్ ఎంగేజ్ మెంట్ చేసుకో.. ఆ తర్వాత కాలేజీ గురించి శైలేంద్ర గురించి ఆలోచిద్దామని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.