Read more!

English | Telugu

వసుధార ఒంటరి పోరాటం... జగతి ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -734 లో.. వసుధార ఎక్కడుందో వెతుక్కుంటూ రిషి వెళ్తాడు. వసు లొకేషన్ షేర్ చెయ్యను.. మీరే గెస్ చేసి రండని అంటుంది. దాంతో రిషి ఆలోచనలో పడతాడు. వసు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసని వెళ్తాడు. వసు బస్తీ పిల్లలతో గోళీలు ఆడుకుంటూ ఉండగా రిషి చూసి తన దగ్గరికి వెళ్తాడు. నేను సాయం చేయనా అంటూ రిషి అనగానే.. వసుధార అక్కడ రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడున్న పిల్లలకు  బైబై చెప్పి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటారు. సర్ నా ఫోన్ లో జీపీఎస్  ట్రాకర్ పెట్టారా అని వసుధార అనగానే.. లేదు నీ హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీని బట్టి నా హార్ట్ ఫాలో అయిందని రిషి అంటాడు. 

మరోవైపు జగతి, మహేంద్ర ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. జగతి స్త్రీల గొప్పతనం గురించి మాట్లాడుతుంది. మనం విడిపోయినప్పుడు, నువ్వు మీ ఇంట్లో అందరితో ఉన్నావ్.. నేను ఒంటరిగా ఉన్నాను.. ఇప్పుడు రిషి, వసుధారల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు.. రిషి అందరితో ఉన్నాడు.. వసుధార మాత్రం ఒంటరిగా పోరాడింది. రిషి నిలబడలేకపోయాడు, సాటి మగాడు ఎలా స్పందించాడో రిషి అలాగే స్పందించాడు.. వసుధార ధైర్యంగా తన ప్రేమని నిలబెట్టుకుందని జగతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడు మహేంద్ర తన చెయ్యి పట్టుకొని.. మీ స్త్రీ జాతి మొత్తానికి నమస్కరిస్తున్నానని చెప్పి మహేంద్ర కూడా ఎమోషనల్ అవుతాడు. మనం ఎన్ని రోజులు దూరంగా ఉన్నా.. ఎప్పుడు నీకు దగ్గరగా ఉన్నాను.. నువ్వు మళ్ళీ తిరిగి వస్తూ నీ కోడలిని తీసుకొచ్చావని మహేంద్ర అంటాడు. మరోవైపు దేవాయని ఈ బయటకు వెళ్లిన జంటలు ఇంకా రాలేదా.. అసలు రిషి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటూ ధరణిని అడుగగా.. రిషి తన నిర్ణయాలు తాను తీసుకుంటాడని ధరణి చెప్తుంది.

మరోవైపు రిషి, వసుధారలు సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళ ప్రేమ జ్ఞాపకాలు మాట్లాడుకొని ఇంటికి బయలుదేరుతారు. ఈ క్షణం ఇలా ఆగిపోవాలనిపిస్తోంది.. ఎప్పుడు నీతో ఉండాలని ఉందని రిషి అంటాడు. కానీ ఆడపిల్లకి పెళ్లి కావాలని వసుధార అనగానే.. ఒకటి చెప్పనా ఎవరికి చెప్పొద్దూ అని రిషి అంటాడు. హ చెప్పండి సర్ ఎవరికీ చెప్పానని వసుధార అంటుంది. నిజం చెప్పాలంటే పెళ్లి విషయంలో నీకంటే తొందర నాకే ఉంది.. MH అంటే My Heart అని చెప్పి రిషి సిగ్గుపడతాడు. అవునా సర్ అని వసుధార నవ్వుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.