Read more!

English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ తండ్రి కన్నుమూత

 


గుప్పెడంత మనసు సీరియల్ తో  యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు రిషి సర్ అలియాస్ ముకేష్ గౌడ.. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ కావడంతో యువత ఈ సర్ ని బాగా లైక్ చేస్తూ ఉంటారు. సీరియల్ కి సోలో  హీరోగా  రిషి పాత్రలో ఈ  కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ అదరగొడుతున్నాడు. కాలేజీ ఎండీగా , తల్లిపై కోపంతో , తండ్రిపై ప్రేమతో , వసుధారా భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఆమె  ప్రేమ కోసం  తపించే లెక్చరర్ గా రిషి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి  బుల్లితెరపై అడుగుపెట్టిన ముకేష్ కన్నడలో  'నాగ కన్నిక' సీరియల్‌ తో నటుడిగా పరిచయమయ్యాడు.

ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. నిజం చెప్పాలంటే  రిషి కోసమే  అమ్మాయిలు ఈ సీరియల్ చూస్తున్నారని..  అబ్బాయిలు మాత్రం రిషి స్టైల్ కోసమే ఈ సీరియల్ ఫాలో అవుతున్నారని  టాక్. ముఖేష్ ఒక ఫామిలీ మ్యాన్..అమ్మ, నాన్న, అక్క, మేనల్లుడుతో చాలా హ్యాపీగా ఉంటాడు. ఐతే ముఖేష్ వాళ్ళ నాన్న కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. రీసెంట్ గా జరిగిన స్టార్ మా అవార్డ్స్ ఫంక్షన్ లో రిషి వాళ్ళ నాన్నను తీసుకొచ్చి తనకు పుట్టిన కొడుకుగా భావించి ఆయనకు కావాల్సినవన్నీ అందిస్తూ  దగ్గరుండి చూసుకుంటున్నట్లు చెప్పి స్టేజి మీద ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా  ముఖేష్ గౌడ వాళ్ళ  నాన్న కన్నుమూశారు.

చాలా ఏళ్ళ క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన తన తండ్రిని చిన్నపిల్లాడిలా చూసుకుంటూ ఫామిలీకి ధైర్యాన్ని అందిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు వెళ్లిపోవడం రిషిని బాధించే విషయమని చెప్పాలి. ఈ విషయం తెలిసిన ముఖేష్ ఫాన్స్ ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని, ఆయన  కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్ పేజీలో కామెంట్స్ పెడుతున్నారు.