Read more!

English | Telugu

అక్కడ స్వప్న పెళ్ళిచూపులు ఫట్.. ఇక్కడ రాహుల్ కి రాజ్ పెట్టిన చెక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో..‌ రాహుల్ ని వెన్నెలకిచ్చి పెళ్లి చెయ్యడం వింటాడు రాజ్. దాంతో కావ్య ఏదో మాట్లాడాలని చూస్తుంది. వెంటనే రాజ్ తనని పక్కకి పిలిచి.. బలమైన సాక్ష్యాలు లేకుండా, తెలిసి తెలియకుండా వాళ్ళ గురించి ఏం మాట్లాడకని కావ్యతో రాజ్ చెప్తాడు. కావ్య మౌనంగా ఉంటుంది. నువ్వు మీ అక్క గురించి అలోచించి డిస్టబెన్స్ క్రియేట్ చేయకని కావ్య తో మాట తీసుకుంటాడు రాజ్. ఆ తర్వాత మా అక్క పరిస్థితి ఏంటని కావ్య ఆలోచిస్తుంది.

మరొకవైపు స్వప్నకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది కనకం. పెళ్లి కూతురు నాకు నచ్చిందని అబ్బాయి చెప్పగానే.. ఇంత అందమైన అమ్మాయి నచ్చకుండా ఉంటుందా? ఈ పెళ్లి చూపులు ఎలా కాన్సిల్ చెయ్యాలో నాకు తెలుసని స్వప్న అనుకుంటుంది.  లేచిపోయి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని స్వప్న ఎవరికీ తెలియకుండా సీక్రట్ గా ఆ  అబ్బాయికి మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ చూసిన అబ్బాయి ఫ్యామిలీ.. మీ పెళ్ళి సంబంధం వద్దని కనకం ఫ్యామిలీని అవమానించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్వప్న గదిలోకి వెళ్ళి..  "మీ సంబంధం చేసుకోవలసిన కర్మ నాకేంటి.. నేను దుగ్గిరాల ఇంటి కోడలిని" అని అనుకుంటుంది స్వప్న. మరొకవైపు రాహుల్ కి పెళ్లి చేస్తున్నట్లు మా అక్క స్వప్నకి తెలిస్తే తన నిజస్వరూపం తెలుస్తుందని కావ్య అనుకుంటుంది. ఎలాగైనా మా అక్కకి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ ని అప్పుకి ఫోన్ చెయ్యమంటుంది కావ్య. కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే అప్పు కట్ చేస్తుంది. మరొకవైపు రుద్రాణి అన్న మాటలు గుర్తుచేసుకుంటూ ధాన్యలక్ష్మి బాధపడుతుంది. అప్పుడే అక్కడికి సుభాష్ వచ్చి ధాన్య లక్ష్మి తో మాట్లాడతాడు. అంతలోనే అపర్ణ, ఇందిరాదేవి, సీతరమ్మయ్య వచ్చి ధాన్యలక్ష్మి కి నచ్చజెప్పుతారు. దుగ్గిరాల ఇంటికి ఏం సంబంధం లేకున్నా ఇంటి ఆడపడుచు హోదా ఇస్తే ఎలా? నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడుతుందా అంటూ బాధపడుతుంది ధాన్యలక్ష్మి. దాంతో అపర్ణ తనని ఓదార్చి లోపలికి తీసుకొని వెళ్తుంది. 

మరొకవైపు కనకంతో స్వప్న మాట్లాడుతుంది. ఇలాంటి పెళ్లిచూపులు చూడకుమ్మా.. నీలా మధ్యతరగతి బతుకు నేను బతకలేనమ్మా అని స్వప్న అనగానే.. స్వప్న చెంప చెల్లుమనిపిస్తుంది కనకం. ఈ పెళ్లి చూపులు చెడిపోయాయి. మన పరువు తీసింది ఇదే అని కనకం చెప్తుంది. స్వప్న పంపిన మెసేజ్ ని అప్పుకి చుడమని ఇస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది.. ఇది ఇలా చేస్తుందని కనకం అంటుంది.. మరొకవైపు రాజ్ లెక్కలు చూస్తాడు. ఆ మొత్తం అమౌంట్ లో రాహుల్ ఎక్కువ డబ్బులు యూజ్ చేసుకున్నట్లు చూపించడంతో రాహుల్ ని పిలిచి రాజ్ అడుగుతాడు. రాహుల్ తడబడుతుంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.