Read more!

English | Telugu

Guppedantha Manasu : జస్ట్ మిస్.. రంగానే రిషి అని శైలేంద్ర కనిపెట్టగలడా!

 

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1134 లో.. శైలేంద్ర తను చూసింది వసుధారనో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి టీ షాప్ దగ్గరకి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు మరొకవైపు వసుధార తప్పించుకుంటుంది. రౌడీలు మళ్ళీ తప్పించుకుందంటూ టీ తాగుదాం పదండి అంటూ టీ షాప్ దగ్గరకి వెళ్తారు. ఇక అక్కడే ఉన్నా శైలేంద్ర పాండు గాడికి ఫోన్ చేసి వసుధారని చంపేశాడో లేదో కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తాడు. పాండు ఫోన్ లిఫ్ట్ చేసి నేను కాకినాడలో కాజా కోసం వెళ్ళానని చెప్తాడు. అప్పుడే శైలేంద్ర, పాండు లు ఒకరికొకరు ఎదరుపడతారు.

ఏంట్రా కాకినాడలో ఉన్నా అన్నావని పాండుని శైలేంద్ర అడుగుతాడు. లేదు సర్ ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చానని పాండు అంటాడు. సరేగానీ ఇందాక వసుధార కన్పించింది. నువ్వు నిజంగానే చంపేసావా అని అడుగుతాడు. అది వీడికి కూడా కన్పించిందా అని పాండు అనుకుంటాడు. నిజంగానే చంపామని పాండు చెప్తాడు. ఆ తర్వాత పాండు వెళ్ళిపోతాడు. వీడిని నమ్మడానికి లేదని శైలేంద్ర వసుధార ఫోటోని చూపిస్తూ టీ షాప్ అతన్ని అడుగుతాడు. తీరా చూస్తే అక్కడ పాండు ఉంటాడు. ఏంటి సర్ మా మీద నమ్మకం లేదా? మమల్ని అవమానిస్తున్నారని పాండు అనగానే.. సరేలే నమ్మానని శైలేంద్ర అంటాడు.ఆ తర్వాత టీ షాప్ అతన్ని రంగా అడ్రెస్ అడుగుతాడు ‌ రంగా ఇంటికి తీసుకొని వెళ్ళమని శైలేంద్రతో బాబుని ఇచ్చి పంపిస్తాడు. మరొకవైపు రంగా ఆటోని వాటర్ తో క్లీన్ చేస్తుంటే.‌ అప్పుడే వసుధార వస్తుంది‌ అనుకోకుండా వసుధార డ్రెస్ తడిసిపోతుంది.

మీరు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకోండి అని వసుధారని రంగా లోపలికి పంపించి బయటనుండి గడియ పెడతాడు. అప్పుడే శైలేంద్ర రంగా దగ్గరికి వస్తాడు. ఏంటి ఇలా వచ్చారని రంగా అనగానే.. సరోజ గురించి మా తమ్ముడికి కొన్ని డౌట్స్ ఉన్నాయట అందుకే అని శైలేంద్ర అంటాడు. అప్పుడే వసుధార డోర్ కొడుతుంది. ఎక్కడ వసుధార బయటకు వస్తుందోనని రంగా ఆలోచిస్తాడు. సరోజ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందామని శైలేంద్రతో రంగా అంటాడు. అప్పుడే రాధమ్మ వస్తుంది. శైలేంద్ర మాట్లాడుతుంటే వసుధార తన వాయిస్ విని శైలేంద్ర వాయిస్ ల ఉందని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక రాధమ్మ వచ్చి గడియతీస్తుంది. ఇందాక వచ్చింది ఎవరని వసుధార అనగానే.. సరోజ ని చూడడానికి వచ్చినవాళ్ళు.. సరోజ ఇంటికి వెళ్లారని రాధామ్మ చెప్తుంది. ప్రొద్దున దేవయాని గారి వాయిస్, ఇప్పుడు శైలేంద్ర వాయిస్.. ఏంటి ఇలా ఎలాగైనా ఇప్పుడు వచ్చింది. శైలేంద్ర నో కాదో సరోజ ఇంటికి వెళ్ళాలని వయసు అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.