English | Telugu

Brahmamudi : శోభనం అక్కడే చేసేశాడు.. నాకు అంతా తెలుసు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -469 లో.. ఇందిరాదేవి అపర్ణ లు రాజ్ , కావ్యల శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. వీళ్ళేంటి ఇంకా రావడం లేదని అపర్ణ అనగానే.. ఇద్దరు డిన్నర్ అయిపోయాక సరదాగా తిరిగి వస్తారేమోనని ఇందిరాదేవి అంటుంది. ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేసాను అత్తయ్య.. కావ్యని అపార్ధం చేసుకొని బాధపెట్టాను ఇక నుండి నా కోడలు సంతోషం కోసం ట్రై చేస్తానని అపర్ణ అనగానే ఇందిరాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. మరొకవైపు మరుసటి రోజు ఉదయం.. రాజ్ నిద్ర లేచి కావ్య నుదుటిపైన ముద్దుపెట్టి తను కిందకి వెళ్తాడు. అక్కడ ఒకతను వచ్చి.. సర్ అరెంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాడు. నీ మొహంలా ఉన్నాయ్ తనని భయపెట్టమంటే నా పక్క నుండి వెళ్లి నన్ను భయపెట్టావని రాజ్ అంటాడు.

చాలా కష్టపడ్డ కొంచెం చూసి డబ్బులు ఇవ్వండి.. మీరు ఇంకోసారి శోభనం చేసుకుంటే మళ్ళీ ఇక్కడికే రండి అని అతను అనగానే.. జీవితంలో ఒకేసారి శోభనం చేసుకుంటారని రాజ్ అంటాడు. వాళ్ళ మాటలన్నీ కావ్య వింటుంది. అతను వెళ్ళిపోయాక ఇదంతా మీ ప్లానా.. మీరు ఒళ్ళంతా ఇగోతో ఉన్నారు. ప్రేమతో భార్యని దగ్గరకి తీసుకోలేక ఇలా భయపెట్టి మీ సొంతం చేసుకున్నారా?  మీకు ఇలా చెయ్యడానికి ఈ పాడుపడ్డ బంగ్లానే దొరికిందా? ఈ విషయం అత్తయ్య, అమ్మమ్మలకి చెప్తానని కావ్య అనగానే.. రాజ్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావ్ దండం పెట్టమంటావా అని రాజ్ అనగానే.. కాళ్ళు ఎవరు పట్టుకుంటారని కావ్య అనగానే.. రాజ్ కాళ్ళు పట్టుకుంటుండగా కావ్య వద్దని చెప్తుంది. చెప్పావుగా అని రాజ్ అనగానే ఆలోచిస్తానని కావ్య అంటుంది. నువు చెప్పవ్ లే అని రాజ్ అంటాడు. సరే వెళదామని కావ్య అనగానే.. మన బట్టలు ఆరి ఉంటాయి.. అవి వేసుకొని వెళదామని రాజ్ అంటాడు.

మరొకవైపు తెల్లవారింది ఇంకా రాలేదని, ఇందిరాదేవి, అపర్ణ లు టెన్షన్ పడుతుంటారు. అప్పుడే కావ్య, రాజ్ వస్తారు. ఎక్కడికి వెళ్లారురా? మీ కోసం రాత్రి శోభనం ఏర్పాట్లు చేసామని ఇందిరాదేవి అనగానే.. మీరు ఇక్కడ ఏర్పాట్లు చేశారు.. మీ మనవడు అక్కడ ఆ కార్యం పూర్తి చేసాడని రాజ్ చేసిన ప్లాన్ గురించి కావ్య చెప్తుంది. రాజ్ కోపంగా చూస్తాడు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదని అపర్ణ, ఇందిరాదేవిలు అంటారు. ఆ తర్వాత ఇందిరాదేవి కావ్య దగ్గరకి వెళ్లి.. వాడు నీ మనసు తెలుసుకోకుండా ప్రవర్తించాడని తప్పుగా అనుకోకని అంటుంది. నేను ఎందుకు అలా అనుకుంటాను అమ్మమ్మ.. నాకు తెలియకుండా అతను అలా చేస్తుంటే నాకు సరదాగా అనిపించింది. నాకు నచ్చనిదే తను నన్ను తాకలేరు కదా.. అయన చేసేది నేను ముందే కనిపెట్టానని కావ్య అనగానే.. అమ్మ దొంగపిల్ల.. నాకు త్వరలోనే ఒక పాపని ఇవ్వాలని ఇందిరాదేవి అనగానే.. ఆ విషయం మీ మనవడికి కూడా చెప్పండని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ఏదో రాసి పారేస్తాడు. అది రాజ్ చూస్తాడు. అందులో అప్పు అంటే ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకున్నావా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఈ రోజు మా అప్పుకి పెళ్లిచూపులు అని కావ్య అనగానే.‌‌‌ రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.