Read more!

English | Telugu

Guppedantha Manasu : మను  అతని కొడుకే.. దత్తత తీసుకుంటే ఎలా మరి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1055 లో.. ఇకనుండి ఆ రాజీవ్ గాడితో మనకు పని లేదు.. మనమే మనం అనుకున్నది చెయ్యగలం. ఇప్పుడే ఆ మను గానికి ఫోన్ చేసి.. రెచ్చగొట్టేలా మాట్లాడాను. ఇక బాబాయ్ కి వాడికి మధ్య పెద్ద గొడవే జరుగుతుందని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత మహేంద్రలోని మొదట అక్షరం 'మ'.. అనుపమ లోని రెండవ అక్షరం 'ను'.. మను అవుతుంది. అసలు మను బాబాయ్ కొడుకే అమ్మ అని శైలేంద్ర అనగానే.. మెల్లగా మాట్లాడు ఎవరైనా వింటారని దేవయాని అంటుంది.

"మీ నాన్న వింటే మను ఈ ఇంటికి వారసుడే అని అంటాడు " అని శైలేంద్రతో దేవయాని అంటుంది. వాడితో అంటున్నాను కానీ నాక్కూడా కొంచెం అనుమానంగా ఉందని దేవయాని అనుకుంటుంది. మరొకవైపు మహేంద్ర కోసం మను వెయిట్ చేస్తుంటే.. అప్పుడే మహేంద్ర, వసుధార ఇద్దరు వస్తారు. ఏంటి సర్ మీకు ఇష్టం వచ్చినట్లు చేసున్నారు.. మీరు నన్ను దత్తత తీసుకోవడమేంటి? మీరు కాలేజీలో చేసిన దానికే అవమానంగా ఫీల్ అవుతుంటే.. ఇప్పుడు ఇదంతా ఏంటని మను ఆవేశపడతాడు. ఇన్నిరోజులు తండ్రి ఎవరని అడిగినప్పుడు‌. అవమానంగా ఫీల్ కాలేదా ఇప్పుడు ఇతనే నా తండ్రి అని గర్వంగా చెప్పు అని మహేంద్ర అంటాడు. నాపై మీ హక్కు ఏంటి అని మను అడుగుతాడు. మరి ఏ హక్కుతో కాలేజీని సేవ్ చేసావ్.. వసుధార బర్త్ డే సెలబ్రేట్ చేసావని‌ మనుతో మహేంద్ర అంటాడు. నేను ఏదో ఒక సంతకం ద్వారా ఇది చెయ్యాలనుకోవడం లేదు.. అందరి ముందు నిన్ను దత్తత తీసుకుంటాను. నువ్వు ఆ రోజు వస్తున్నావ్.. లేదంటే నువ్వు నన్ను ఇక ఎప్పుడు చూడలేవని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత మహేంద్ర దత్తత విషయం.. విశ్వనాథ్ కి ఫోన్ చేసి చెప్తాడు. అనుపమకి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేసి.. నేను విన్నది నిజమేనా? దానికి నువ్వు అడ్డు చెప్పలేదా అని అనుపమని అడుగుతుంది. ఎవరు నా మాట వినేలా లేరని అనుపమ అంటుంది. ఇప్పటికైనా భయం వదిలి ఒక్క అడుగు ముందుకేసి నిజం చెప్పమని.. ఈ సమస్యలు అన్నీ పోతాయని అనుపమతో వాళ్ళ పెద్దమ్మ చెప్తుంది. ఆ తర్వాత మను దగ్గరకి ఆ పెద్దావిడ వచ్చి.. మహేంద్ర అలా ఆంటే నువ్వు వద్దనలేదా అని అడుగుతుంది. చెప్తే వినట్లేదని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.