Read more!

English | Telugu

Guppedantha Manasu : మా భాదలేవో మేమ్ పడేవాళ్ళం కదా! 

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1052 లో.. అనుపమ దగ్గరికి‌ మహేంద్ర వస్తాడు. అనుపమ సైలెంట్ గా ఉండడంతో నాతో మాట్లాడవా అని మహేంద్ర అడుగుతాడు. తప్పు చేసావ్ మహేంద్ర.. నీకు మను హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చెయ్యాలి గానీ ఇలా మను తండ్రిని నేనే అని చెప్పడమేంటి? కొడుకు లాంటి వాడు అనడం వేరు కొడుకు అనడం వేరు.. ఆ బాధ్యత పెద్దది. నువ్వు అలా చెప్పి తప్పు చేసావని అనుపమ అంటుంది. ఆ సిచువేషన్ లో మను పడుతున్న బాధ చూడలేక అలా చెప్పానని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార కూడా.. మీరు అందరి ముందు అలా చెప్పడం కరెక్ట్ కాదని అంటుంది. ఏది ఏమైనా నేను కరెక్ట్ చేసానని అనుకుంటున్నాను‌.. ఇక మీద ఎదురయ్యే ప్రశ్నలకి సమాధానం నేను చెప్తానని మహేంద్ర అంటాడు. అప్పుడే మహేంద్రకి ఫణింద్ర ఫోన్ చేసి.. మాట్లాడాలి, ఇంటికి రా అని చెప్తాడు. ఆ తర్వాత మను గురించి మహేంద్ర చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే దేవయాని వచ్చి.. మహేంద్ర ఇలా చేసాడేంటి? ఎందుకు అలా చేసాడు.. అడిగితే మౌనంగా ఉంటున్నాడని దేవయాని అంటుంది. మహేంద్ర మన కుటుంబానికి తీరని నష్టం తెచ్చాడు. ఇప్పుడు మన కుటుంబ పరువుపోయింది. అందరు ఏమనుకుంటున్నారో.. ఏమో.. మహేంద్ర ఈ ఒక్క తప్పే చేశాడా.. ఇంకా తప్పులు చేశాడా అని అనుకుంటున్నారని  ఫణీంద్రతో దేవయాని చెప్తుంది. మహేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడమేంటి.. అది అయితే నిజం కాదు‌. నా తమ్ముడు తప్పు చెయ్యడని ఫణింద్ర అంటాడు. ఇప్పుడు మను నా కొడుకు అన్నాడు. రేపు అనుపమ నా భార్య అంటాడేమో అని దేవయాని అనగానే.. నోరు ముయ్ అంటు దేవయానిపై ఫణీంద్ర చిరాకు పడతాడు.

మరొకవైపు మను దగ్గరికి వసుధార వస్తుంది. బాధపడుతున్నారా.. మా మావయ్యగారు మీరు బాధ పడుతున్నారని అలా చేసారని అనగానే.. మా బాధలేవో మేమ్ పడేవాళ్ళం కదా.. అయన ఎందుకు అలా చెప్పడమంటు మను కోప్పడతాడు. వాళ్ళు మాట్లాడుకోవడం రాజీవ్ చూస్తాడు. మరొకవైపు ఫణీంద్ర దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. ఎందుకలా చెప్పావంటు మహేంద్రని ఫణీంద్ర అడుగుతాడు. నేను చెపింది అబద్ధమని మీరు నమ్ముతున్నారు కదా‌.. మను బాధపడుతుంటే చూడలేక అలా చెప్పానని మహేంద్ర చెప్తాడు. అలా చెప్పేముందు కుటుంబం గురించి ఆలోచించాలి కదా అంటూ దేవయాని అడుగుతుంది. నేను చేసింది కరెక్టే అని అనుకుంటున్నానని మహేంద్ర చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.