Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : తను నా భార్య‌.. ఇంకోసారి తప్పుగా మాట్లాడితే బాగుండదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -74 లో.. రామలక్ష్మిని హాల్లోకి పిలుస్తుంది శ్రీలత. పంతులు గారి చేత సీతాకాంత్, రామలక్ష్మిల శోభనం ముహూర్తం పెట్టిస్తుంది. ఆల్రెడీ శోభనం అయిందని రామలక్ష్మి కవర్ చేసిన కూడా శ్రీలత వినదు. మీ నాన్న చేసిన పనివల్ల శోభనం ఆగిపోయిందని తెలుసని శ్రీలత అంటుంది. పంతులు గారు సిరి, ధనలకి.. వచ్చే బుధవారం మంచి ముహూర్తం ఉందని, సీతాకాంత్, రామలక్ష్మిలకు ఈరోజు మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. దాంతో రామలక్ష్మి షాక్ అవుతుంది.

మరొకవైపు మాణిక్యం డిస్సపాయింట్ తో ఇంటికి వస్తాడు. సుజాత ఇక వెళదామా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడతావంటూ మాణిక్యం కోప్పడతాడు. ముందు సీతాకాంత్ చెప్పినట్టు జాబ్ లో జాయిన్ అయ్యి.. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని మాణిక్యం అనుకుంటాడు. ఆ తర్వాత సీతకాంత్ ఆఫీస్ కు వెళ్ళగానే అందరు కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి.. లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటగా అని అనగానే అప్పుడే సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. నాకు చాలా బాధగా ఉంది సర్.. ఇలా నటిస్తున్నాం.. ఇందులో ఇంకా లవ్ మ్యారేజ్ అంటే ఎలా ఉంటుందని రామలక్ష్మి బాధపడుతుంది. ఆ తర్వాత ఈ రోజు మీ అమ్మగారు మనకు శోభనం ముహూర్తం పెట్టించారని అనగానే.. దానికి ఎందుకు టెన్షన్ అని సీతాకాంత్ అంటాడు. అలా ప్రతిసారీ గదిలోకి వెళ్లడం, తెల్లవారి ఇంట్లో వాళ్ళు గుచ్చిగుచ్చి ప్రశ్నలు వెయ్యడం..నాకు ఇబ్బందిగా ఉందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత అభి ఫారెన్ వెళ్లలేదు.. వాళ్ళ అమ్మ హెల్త్ బాలేదట.. నువ్వేం టెన్షన్ పడకు ఇంటికి వెళ్ళు అని సీతాకాంత్ చెప్తాడు.

ఆ తర్వాత ఆఫీస్ స్టాఫ్ రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. తను నా భార్య..  ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని చెప్తాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి అభి వచ్చి.. డబ్బులు తీసుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి వెళ్తుంటే అభిని చూసి ఆగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని రామలక్ష్మి బాధపడుతుంటే.. నువ్వు ఇంకా కొన్ని రోజులు సీతాకాంత్ సర్ దగ్గర ఉంటేనే నేను కోట్లకి కోట్లు సర్ దగ్గర నుండి తీసుకోవచ్చని అభి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత నిన్ను వదిలి ఫారెన్ వెళ్ళాలనిపించలేదని అభి అనగానే.. అదేంటీ సీతా సర్ మీ అమ్మకి బాలేక వెళ్లలేదని చెప్పాడని రామలక్ష్మి అనగానే.. అభి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.