Read more!

English | Telugu

దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుందా.. నమ్మితే పంగనామాలే!

గలాటా గీతూ అలియాస్ చిత్తూర్ చిరుత అంటే ఇప్పుడు ఫుల్ ఫేమస్. బిగ్ బాస్ కి వెళ్ళకముందు యూట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ ఒక మోస్తరుగా పేరు తెచ్చుకున్న గీతూ హౌస్ లోకి వెళ్లి వచ్చాక మస్త్ ఫెమిలియర్ ఐపోయింది. గీతూ రకరకాల వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఈ అమ్మడు అప్పుడప్పుడు జీవిత పాఠాలను కూడా వీడియోలుగా చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. 

రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టిన ఒక పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. "దూరం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది.. అనే మాట మనం చాలా వింటా ఉంటాం. ఆ కాన్సెప్ట్ మీరు నమ్ముతారా? నమ్మినారనుకో పంగనామాలే ఇంక. ఎందుకంటే ఒక మనిషిని దూరం పెడితే వాళ్లకి మన విలువ తెలిసి మన మీద ప్రేమ పెరుగుతుందా లేదా... అనేది నాకు తెలియదు కానీ.. ఒక మనిషిని మనం విలువ తెలుసుకునేదానికి దూరం పెడితే.. వాళ్లు మనం లేకుండా బతికేదానికి అలవాటు చేసుకుంటారు. ఆ తప్పు మాత్రం చేయొద్దండి." అని చెప్పింది. "మరి మన విలువ తెలియాలి అంటే.. ప్రేమ పెరగాలి అంటే ఏం చెయ్యాలి. కరెక్టే..మారుతున్న రోజులు..మారిపోతున్న మనుషుల్ని బట్టి మన సామెతలను కూడా మార్చుకోవాల్సి వస్తోంది..." అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా వెళ్ళను అంటూ అక్కడే ఏడ్చేసింది.