Read more!

English | Telugu

వాలైంటైన్స్ డే రోజు అందరికీ షాక్ ఇచ్చిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి'  సీరియల్ ఎపిసోడ్-84 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం నాటి ఎపిసోడ్ లో.. ముకుంద ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదే.. తన ప్లాన్ ని ఎలాగైనా ఆపాలని ముకుందకి మురారి ఫోన్ చేస్తాడు. మురారి కాల్ చేసాడనే సంతోషంతో ఫోన్ లిఫ్ట్ చేసిన ముకుంద.. "ఏంటీ మురారి కాల్ చేసావ్" అని అడుగగా.. "నువ్వు ఏం చేస్తున్నావ్ ముకుంద? నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు.. అందరి ముందు నువ్వు నాకు రోజ్ ఇస్తే ఇంట్లో వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు.. మన గురించి తెలిసిపోతుంది కదా" అని మురారి అంటాడు. తెలిస్తే తెలియనివ్వు అన్నట్లుగా ముకుంద మాట్లాడుతుంది.

మరోవైపు కృష్ణ వాలెంటైన్స్ డే కాబట్టి ఇల్లంతా హార్ట్ షేప్ బెలూన్ లతో డెకరేట్ చేస్తుంది. అప్పుడే కిందకి వచ్చిన భవాని అదంతా చూసి.. "ఏంటీ ఇదంతా" అని అడుగుతుంది. ఈ రోజు వాలెంటైన్స్ డే పెద్ద అత్తయ్య అని చెప్తుంది. అయితే ఇక్కడ పెళ్లి కాని ప్రేమికులు ఎవరున్నారని భవాని అడుగుతుంది. ఈరోజు ప్రేమికులది మాత్రమే కాదు అత్తయ్యా.. ఎవరైనా జరుపుకోవచ్చు అని అంటుంది. కృష్ణ మాటలకి మొదట్లో భవానీ కోప్పడినా తర్వాత సరదాగానే తీసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారిలు రెడీ అయి వస్తారు.

ముకుంద తన రూం నుండి బయటకు రోజ్ పట్టుకొని వస్తుంటే.. అందరూ తనవైపే చూస్తారు. మురారి మాత్రం.. ఆ రోజ్ తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇస్తుందా అని టెన్షన్ పడుతుంటాడు. రేవతి కూడా తన మనసులో మురారికి ఇస్తుందా ఏంటీ అనుకుంటుంది. తను అనుకునట్టుగానే ముకుంద,  మురారికి రోజ్ ఇచ్చి హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అసలు మురారికి ముకుంద ఎందుకు రోజ్ ఇచ్చింది? ఇది నిజమా? కలనా? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.