English | Telugu

'జబర్దస్త్' పేరుతో మోసాలు.. వార్నింగ్ ఇచ్చిన కమెడియన్!

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు గుర్తింపు లభించింది. ఆర్థికంగా కూడా ఈ షో చాలా మందిని ఆదుకుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో కూడా రాణిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఈ షో పేరుని వాడుకుంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై కమెడియన్ రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మొదట్లో చిన్నపిల్లలతో ఎక్కువగా స్కిట్ లు చేసిన రాకేష్.. ఆ తరువాత నటి రోహిణితో ఎక్కువగా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా రాకేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో 'జబర్దస్త్' పేరుతో మోసాలు చేస్తున్నారని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 'జబర్దస్త్' షోలో అవకాశం వస్తుందని ఆశపడి.. మోసగాళ్ల మాటలు నమ్ముతున్నారని చెప్పాడు.

'జబర్దస్త్' షో అవకాశం కావాలంటే ఎవ‌రికి వారే వెతుక్కోవాలని.. ఈ షోలో అవకాశాలు ఇచ్చేవాళ్లు డబ్బులు వసూలు చేయరనే విషయాన్ని గుర్తించుకోవాలని రాకేష్ తెలిపాడు. రాకేష్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ 'చంటబ్బాయ్'లో ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది తన పేరు వాడుకొని పెద్ద మొత్తంలో డబ్బుని వసూలు చేశారని.. ఇకపై అలా ఎవరైనా చేస్తే దయచేసి తనకు కామెంట్ల రూపంలో తెలియజేయాలని అత‌ను కోరాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.