Read more!

English | Telugu

యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్!


ప్రతీరోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో‌ ఆకట్టుకుంటున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ స్టార్ మా టీవీలో ప్రతీరోజు సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం నాలుగు గంటలకి ప్రసారమవుతుంది.

స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది. మరి అంతగా ఈ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. ఇక ఈ జన్మకి సంబంధించిన పరిచయంలో.. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. రామలక్ష్మి సివిల్ సర్వీస్  కోచింగ్ తీసుకుంటుంది‌. దాంతో పాటుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రామలక్ష్మికి ఒక తమ్ముడు, చెల్లెలు ఉండగా.. తమ్ముడు కాలేజీ, చెల్లలు స్కూల్ చదువుతుంటారు. ఇక తల్లి వంటింటికి పరిమితం‌.. ఎప్పుడు జాతకాలంటు టీవీ చూస్తు వాటినే ఫాలో అవుతుండే ఓ సాధారాణ గృహిణి. తండ్రి బారెడు పొద్దెక్కిన లేవలేని ఓ తాగుబోతు. ఇక ఇంట్లో వీరందరి అవసరాలు తీరుస్తూ రామలక్ష్మి కుటుంబానికి అండగా  ఉంటుంది. సీతాకాంత్.. కోటిశ్వరుడు. నలబై సంవత్సరాలైనా ఇంకా పెళ్లి చేసుకోని బిజినెస్ మెన్. 

అయితే తాజా ఎపిసోడ్ లలో.. సీతాకాంత్ చెల్లెలు సిరికి, రామలక్ష్మి తమ్ముడు ధనకి పెళ్లి జరుగుతుంది. అయితే ఈ తరుణంలో మాణిక్యం, శ్రీలతలకి ఓ డౌట్ వస్తుంది. అసలు సీతాకాంత్, రామలక్ష్మి నిజంగానే పెళ్ళి చేసుకున్నారా అని అడుగగా..‌అక్కడ పెళ్ళి జరిపించే స్వామి.. వారిద్దరికి ఈ జన్మలోనే కాదు గతజన్మలో కూడా పెళ్ళి జరిగిందని చెప్తాడు. అది విని అందరు షాక్ అవుతారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రామలక్ష్మి, సీతాకాంత్ లకి కావాలనే శోభనం ముహుర్తం పెట్టిస్తుంది శ్రీలత.  అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడున్నవాళ్ళు రామలక్ష్మి కావాలనే సీతాకాంత్ ని పెళ్ళి చేసుకుందని, మొదట నవ్వించింది. ఆ తర్వాత కవ్వించిందని గాసిప్స్ మాట్లాడుతుంటారు. ఇక అప్పుడే వచ్చిన సీతాకాంత్.. షటప్ అని గట్టిగా అరుస్తాడు. రామలక్ష్మి నా భార్య.. నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. అని వారందరికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆఫీస్ వాళ్ళ మాటలకి రామలక్ష్మి కన్నీరుపెట్టుకుంటూ వెళ్తుంటే సీతాకాంత్ తన చేతిని పట్టుకుంటాడు. దాంతో రామలక్ష్మి తనవంక చూస్తుంది. ఇక సీతాకాంత్ ఆ చేయిని వదిలేస్తాడు. మరి అభిని ఇష్టపడుతున్న రామలక్ష్మి .. సీతాకాంత్ కి ఎలా దగ్గరవుతుంది. అభి గురించి నిజం తెలుసుకోగలదా లాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సీరియల్ సాగుతోంది. మరి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ సీరియల్ ప్రోమోని మీరు చూశారా.