Read more!

English | Telugu

Eto Vellipoindhi Manasu : రామలక్ష్మి లైఫ్ లో అభి ఉన్నాడని తెలిసి షాకైన సీతాకాంత్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' .  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-49 లో.. సీతాకాంత్ తన గదిలో ఉండి ధన, సిరిల పెళ్ళి గురించి ఆలోచిస్తుంటాడు. మరోవైపు రామలక్ష్మి తన ఇంట్లో ఉండి వాళ్ళ నాన్న మాణిక్యం పెట్టిన షరతు గురించి ఆలోచిస్తుంటుంది.

సీతాకాంత్, రామలక్ష్మి ఓ ఓ ప్లేస్ లో కలుస్తారు‌. అక్కడికి సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో కలిసి వస్తాడు. రామలక్ష్మిని ప్రేమిస్తున్నట్లుగా సీతాకాంత్ చెప్పాలనుకుంటున్నాడని వాళ్ళ తాతయ్య భావించి తనతో పాటు వస్తాడు. సీతాకాంత్ కూడా అదే విషయం చెప్పడానికి రామలక్ష్మిని కలుస్తాడు. ఇక సీతాకాంత్ తన మనసులోని మాట చెప్పాలనుకుంటుండగా రామలక్ష్మి తనను చెప్పకుండా ఆపేస్తుంది. అభిని రామలక్ష్మి పిలిచి.. తను, అభి ప్రేమించుకుంటున్నారని సీతాకాంత్ తో చెప్తుంది‌. కానీ వాళ్ళ నాన్న అడ్డుగా ఉన్నాడని ధన, సిరిల పెళ్ళి జరగాలంటే మనిద్దరి పెళ్ళి జరగాలని కండిషన్ పెట్టాడని రామలక్ష్మి తమ బాధని చెప్పుకుంటుంది. ఇక సీతాకాంత్ తన మనసులోని ప్రేమని త్యాగం చేయడానికి కాసేపు ఎమోషనల్ అవుతాడు. సీతాకాంత్ పక్కకి వెళ్ళి బాధపడుతుంటే వాళ్ళ తాతయ్య వచ్చి.‌.‌ నన్ను క్షమించు సీతా.. నీ లైఫ్ లోకి రామలక్ష్మి లాంటి అమ్మాయి వస్తే బాగుంటుందని ఆలోచించే కానీ వేసిన మొదటి అడుగే ఇలా అవుతుందని ఊహించలేదని సీతాకాంత్ తో వాళ్ళ తాతయ్య అంటాడు. నా గొంతు నులిపెడుతున్నట్టు, మనసు ముక్కలవుతున్నట్టు, ఊపిరి ఆగుతున్నట్టుగా అనిపిస్తుందని సీతాకాంత్ అంటాడు‌‌. ఫస్ట్ టైమ్ నా మనసు నన్ను మోసం చేసిందని వాళ్ళ తాతయ్యతో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత అభి, రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెళ్ళి మాట్లాడతాడు.

సిరి, ధనల పెళ్ళి జరగాలని దానికి మీరే పరిష్కారం చెప్పాలని సీతాకాంత్ తో రామలక్ష్మి అంటుంది. దానికి ఒకే ఒక దారి ఉంది. నువ్వు, నేను పెళ్ళి చేసుకుంటామని, ఆ తర్వాత నెలో రెండు నెలలకో‌ మనం పెళ్ళి చేసుకుంటామని ముందుగా మీ నాన్నని నమ్మించాలి‌. ధన, సిరిల పెళ్ళి తర్వాత ధన ఇల్లరికం వస్తాడు కాబట్టి మీ నాన్న ఏం చేయలేడు. ఆ తర్వాత మనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్తామని చెప్తాడు. ఆయితే ఈ నిర్ణయానికి అభి ఒప్పుకోడు. దాంతో రామలక్ష్మి ఒప్పిస్తుంది‌. సరేనని తమ నిర్ణయాన్ని సీతాకాంత్ తో చెప్పగా.. అయితే ముందుగా మీ నాన్నని మనం పెళ్ళి చేసుకుంటామని నమ్మించు అని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత అభి, రామలక్ష్మి వెళ్ళిపోతారు. సీతాకాంత్ వాళ్ళ తాతయ్య, సీతాకాంత్ బాధపడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.