Read more!

English | Telugu

ఎదపై టాటూ కనిపించేలా అందాలను ఒలకబోస్తున్న దివి!

దివి వడ్త్య ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. బిగ్ బాస్ -4 సీజన్లో అడుగుపెట్టిన దివి.. ఆ షోలో తన అందాలతో యూత్ ని తనవైపు తిప్పుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్ ని షేర్ చేస్తున్న ఈ భామ.. ఫ్యాన్ బేస్ పెంచుకుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీలో తళుక్కుమన్న ఈ భామ.. అడపాదడపా షార్ట్ ఫిల్మ్ లలో నటించింది. కాగా A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా వచ్చిన 'ఏటీఎమ్' వెబ్ సిరీస్ లో తన అందాలతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసిన ఈ భామకు.. యాక్టింగ్ కి స్కోప్ లేకుండా కేవలం అందాల ఆరబోతకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయనే చెప్పాలి. ఇన్ స్టాగ్రామ్ లో కూడా హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొడుతోంది.

హాట్ పిక్స్ తో ఎప్పటికప్పుడు యూత్ ని ఆకట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది దివి. తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంది. బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన బ్యూటీ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఎదపై టాటూ కన్పిస్తున్న ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా తను మాత్రం ఇలాంటివి చాలా సహజమన్నట్టు చిల్ అవుతోంది. ఈ ఫోటోలని చూసిన వీక్షకులు మాత్రం హాట్ అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇలా తన అందంతో సోషల్ మీడియాలోని హాట్ గర్ల్స్ జాబితాలోకి చేరింది దివి.