English | Telugu

రియ‌ల్ లైఫ్‌లో 'కార్తీక దీపం' మోనిత ఎవ‌రో తెలుసా?

స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న పాపుల‌ర్ సీరియ‌ల్ 'కార్తీక దీపం'. నిరుప‌మ్, ప్రేమి విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వంట‌ల‌క్క‌గా దీప పాత్ర‌లో న‌టించిన ప్రేమి విశ్వ‌నాథ్ బుల్లితెర‌పై స్టార్ సెల‌బ్రిటీగా మారిపోయింది. ఇదే సీరియ‌ల్‌లో దీపని అష్ట‌క‌ష్టాలు పెడుతూ డాక్ట‌ర్ బాబును త‌న సొంతం చేసుకోవ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నించే మోనిత పాత్ర కూడా పాపులారిటీ ద‌క్కించుకుంది. అయితే ఈ మోనిత ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సీరియ‌ల్‌లో మోనిత‌గా న‌టిస్తున్న న‌టి పేరు శోభా శెట్టి. బెంగ‌ళూరులోని ఒక తుళు ఫ్యామిలీలో పుట్టిన శోభా శెట్టి తెలుగు సీరియ‌ల్ 'కార్తీక దీపం'తోటే వెలుగులోకి వ‌చ్చింది. మంచి పాపులారిటీని ద‌క్కించుకుంది. క‌న్న‌డ‌, తుళు, తెలుగు ఇండ‌స్ట్రీల్లో ప‌ని చేసింది. 2013లో న‌టిగా క‌న్న‌డ క‌ల‌ర్స్ టీవీలో ప్ర‌సార‌మైన 'అగ్ని సాక్షి' సీరియ‌ల్‌తో కెరీర్‌ని ప్రారంభించింది శోభ‌.

2017లో పునీత్ రాజ్‌కుమార్, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన 'అంజ‌నీ పుత్ర‌' సినిమాతో వెండితెర‌కు సైతం ప‌రిచ‌య‌మైంది. టిక్ టాక్ వీడియోల‌తోనూ పాపులారిటీని ద‌క్కించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి ప్ర‌స్తుతం 'కార్తీక దీపం', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సీరియ‌ల్స్‌లో న‌టిస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.