Read more!

English | Telugu

జగద్ధాత్రిగా రాధమ్మ కూతురు సీరియల్ ఫేమ్ దీప్తి మన్నె!

దీప్తి మన్నె.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ జీ తెలుగు ప్రేక్షకులకు రాధమ్మ కూతురు సీరియల్ లో అక్షర క్యారెక్టర్ అందరికి సుపరిచితమే.  అక్షర పాత్రలో దీప్తి మన్నె తనదైన నటనతో ప్రేక్షకాభిమానాన్ని పొందుతుంది. 

జీ తెలుగు సీరియల్స్  లో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న సీరియల్ రాధమ్మ కూతురు.  ఈ సీరియల్ లో అక్షర పాత్రలో దీప్తి మన్నే నటిస్తోంది. తన పాత్ర ఈ సీరియల్ కే పేరు తెచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క అక్షర, దీప్తి మన్నె పేరు మీద ఇన్ స్టాగ్రామ్ లో ఎన్నో ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఈ పేజీలలో  అక్షర(దీప్తి మన్నె) లేటెస్ట్ ఫోటోలతో పాటుగా, రీల్స్ ని షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక‌ ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు తన అభిమానులు. అయితే రాధమ్మ కూతురు తర్వాత దీప్తి మన్నె ఎందులో నటిస్తుందంటూ తన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం అవుతున్న జగద్ధాత్రి సీరియల్ లో  హీరోయిన్ గా దీప్తి మన్నె నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సీరియల్ 'జీ బంగ్లా'  లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ 'జగదధాత్రి' సీరియల్ కి రీమేక్ అంట. అయితే ఇప్పటికే జీ తెలుగు ఛానెల్ లో ఒక సీరియల్ ముగుంపుకి రావడంతో దాని స్థానంలో ఈ సీరియల్ ని తీసుకురావాలనే ఆలోచనలో జీ తెలుగు యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.

జగద్ధాత్రి సీరియల్ కి సంబంధించిన పూజ కార్యక్రమం పూర్తి చేసుకొని షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సీరియల్ బంగ్లాలో ఇప్పుడు ప్రైమ్ టైం లో ప్రసారమవుతుంది. ఇందులో దీప్తి మన్నె హీరోయిన్ కాగా హీరోగా ఒక కన్నడ నటుడు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ సీరియల్ లో నాగిరెడ్డి, రాహేంద్ర, అనిల్ కుమార్, సుహాన్ తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తుంది. జగద్దాత్రి సీరియల్ ఒక థ్రిల్లర్ కథగా రూపొందుతోంది. అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది ఇ కథ. అనాధ అయిన జగద్ధాత్రి, ఒమ ధనవంతుడు అయిన హీరో చుట్టూ  కథ తిరుగుతుంటుంది. వీళ్ళిద్దరు మంచి స్నేహితులతో పాటు ఇద్దరు క్రైమ్ ఆఫీసర్స్. తన ఐడెంటిటీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ ఆపరేషన్ కోసం జగద్ధాత్రి పని చేస్తుంటుంది. మరి జీ బంగ్లాలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సీరియల్ ఇక్కడ తెలుగు అభిమానులకి నచ్చుతుందో లేదో తెలియాలి. అయితే ఈ సీరియల్ ఎప్పటి నుండి ప్రసారం కానుందో మేకర్స్ ఇంకా అఫిషియల్  రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కాగా దీప్తి మన్నె అభిమానులు మాత్రం ఈ సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.